Home /News /national /

PM MODI GUJARAT VISIT UPDATES PM MODI INAUGURATES KDP MUNICIPAL HOSPITAL IN ATKOT RAJKOT PM MODI RALLY AT ATKOT GH MKS

PM Modi | Gujarat : 8 ఏళ్లుగా పేదలకు సేవ చేస్తున్నాం.. అత్‌కోట్‌ ఆస్పత్రి ప్రారభోత్సవంలో మోదీ

గుజరాత్ అత్‌కోట్‌ లో ఆస్పత్రిని ప్రారంభిస్తోన్న పీఎం మోదీ

గుజరాత్ అత్‌కోట్‌ లో ఆస్పత్రిని ప్రారంభిస్తోన్న పీఎం మోదీ

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సొంత రాష్ట్రం గుజరాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. రాజ్‌కోట్‌ జిల్లా అత్‌కోట్‌ లో శ్రీ పటేల్ సేవా సమాజ్ ట్రస్ట్ (SPSST) నిర్మించిన కేడీ పర్వదియ (KD Parvadiya) మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రధాని ప్రారంభించారు..

ఇంకా చదవండి ...
మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సొంత రాష్ట్రం గుజరాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. (PM Modi In Gujarat) రాజ్‌కోట్‌ జిల్లా అత్‌కోట్‌ లో శ్రీ పటేల్ సేవా సమాజ్ ట్రస్ట్ (SPSST) నిర్మించిన కేడీ పర్వదియ (KD Parvadiya) మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మోదీ కీలక ప్రసంగం చేశారు.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తయిందని, ఇన్నేళ్లలో పేదలకు సేవ చేయడంతో పాటు సుపరిపాలన అందించామని చెప్పారు. పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చామని హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మోదీ తెలిపారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రాన్ని అనుసరిస్తూ దేశ అభివృద్ధికి కొత్త ఊపునిచ్చామని ఆయన తెలిపారు.

ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మోదీ

Lucky Zodiac Signs : అదృష్టమంటే ఈ రాశుల వారిదే.. వచ్చే నెలంతా డబ్బే డబ్బు.. అన్నింటా విజయాలు..


గుజరాత్ జస్దాన్ తాలూకాలో మొట్టమొదటి మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి అయిన కేడీ పర్వదియ హాస్పిటల్‌ను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు భరత్ బోఘ్రా నేతృత్వంలోని ఛారిటబుల్ ట్రస్ట్ నిర్మించింది. ఈ హాస్పిటల్‌లో 200 పడకలు, 1.25 లక్షల చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. ఇటీవల జస్దాన్‌లో ప్రధాని మోదీ ఇటీవల పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2017 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇదే తాలూకాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ ప్రాంతంలో బీజేపీకి గట్టి సవాలు ఎదురైంది.

అత్‌కోట్‌ లోని కేడీపీ ఆస్పత్రి

CM KCR : దేశయాత్రకు బ్రేక్!.. ఫామ్‌హౌస్‌కు కేసీఆర్.. దసరా నుంచి ఢిల్లీలో చక్రం.. PM అవుతారంటూ..


* హాప్పిటల్ ప్రాధాన్యం : ఈ ఆసుపత్రిని శ్రీ పటేల్ సేవా సమాజ్ ట్రస్ట్ రూ. 50 కోట్లతో నిర్మించింది. ఇది ఈ ప్రాంతంలోని మొట్టమొదటి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ నివేదిక ప్రకారం.. ఇక్కడికి 50 కిలోమీటర్ల పరిధిలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడా లేదు. స్పెషాలిటీ ట్రీట్‌మెంట్ కోసం ప్రజలు రాజ్‌కోట్ లేదా బోటాడ్‌లోని ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో 35 మంది నిపుణులు, సూపర్ స్పెషలిస్ట్ వైద్యులు, దాదాపు 200 మంది నర్సింగ్ సిబ్బంది ఉంటారు. గైనకాలజీ, సర్జరీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఇతర విభాగాలలో సూపర్ స్పెషాలిటీ చికిత్సను అందిస్తారు.

అత్‌కోట్‌ కేడీపీ ఆస్పత్రిలో మోదీ పరిశీలన

Petrol Diesel : పెట్రోల్ లేదు నాయనా.. ఆ ఇద్దరి మధ్య గొడవతో వాహనదారులకు షాక్.. 31న బంద్


* రాజకీయ ప్రాముఖ్యత : సూరత్, రాజ్‌కోట్‌లకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఈ ఆసుపత్రి నిర్మాణానికి చేయూత అందించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే భరత్ బోఘ్రాను వారు బలపరుస్తున్నారు. హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా బోఘ్రా, బీజేపీ భారీ ప్రచారాన్ని ప్రారంభించాయి. దాదాపు 30,000 హోర్డింగ్‌లను ఇక్కడ ఏర్పాటు చేశారు. 1962లో జస్దాన్ సీటు ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువసార్లు అధికారంలో ఉంది.

కేడీపీ ఆస్పత్రి సిబ్బందితో ప్రధాని మోదీ

Monkeypox : ఇండియాకు మంకీపాక్స్ వైరస్ ముప్పు? -ఈ 5లక్షణాలతో జాగ్రత్తగా ఉండాలన్న ICMR


2012 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన భోలా గోహిల్‌పై, 2017 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి కున్వర్జీ బవలియా చేతిలో బోఘ్రా ఓడిపోయారు. ఈ అసెంబ్లీ సీటుకు 15 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిదిసార్లు, స్వతంత్రులు మూడుసార్లు, బీజేపీ రెండుసార్లు, స్వతంత్రపార్టీ ఒకసారి విజయం సాధించాయి. బవలియా కోలిస్‌ అనే ఓబీసీ వర్గానికి చెందిన నేత. ఇక్కడ ఈ సామాజిక వర్గంపై బీజేపీ దృష్టి సారించింది. కుల సమీకరణాల ప్రకారం చూస్తే.. ఈ సీటు నుంచి కోలిస్ వర్గాలకు చెందినవారు తొమ్మిది సార్లు, కతీ దర్బార్లు (OBC), పాటిదార్లు, జైనులు, బావాజీ(OBC)లు ఒక్కొక్కసారి గెలిచారు.

అత్‌కోట్‌ సభలో ప్రధాని మోదీ

Telangana : ముందస్తు వేడిలో మరో యాత్ర.. Manda Krishna Madiga సంగ్రామం.. టార్గెట్ ఎవరంటే..


* ఈ ప్రాజెక్ట్ వెనుక ఎవరున్నారు? : ఈ హాస్పిటల్‌ను SPSST నిర్మించినప్పటికీ, హరేష్ పర్వదియా ఇందుకు 7.51 కోట్ల రూపాయల విరాళం అందించారు. ఆసుపత్రికి ఆయన ప్రధాన దాతగా ఉన్నారు. హాస్పిటల్ ప్రాజెక్ట్ వెనుక మాజీ ఎమ్మెల్యే భరత్ బోఘ్రాను ప్రొజెక్ట్ చేస్తున్నారు. నివేదికల ప్రకారం, ఆయన 2016లో ట్రస్ట్‌లో చేరారు. ప్రస్తుతం దాని మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. ఈ సంస్థ ప్రధానంగా పాటిదార్‌లతో ఏర్పడింది, కానీ ఇతర సంఘాల నుంచి కూడా ట్రస్ట్‌కు ధర్మకర్తలు ఉన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Gujarat, Hospitals, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు