హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Modi Govt : సరోగసీ యాడ్స్‌పై కేంద్రం నిషేధం.. పిల్లల్లో తెలివి పెరుగుతుందనే ప్రకటనలపై కూడా..

Modi Govt : సరోగసీ యాడ్స్‌పై కేంద్రం నిషేధం.. పిల్లల్లో తెలివి పెరుగుతుందనే ప్రకటనలపై కూడా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సరోగసీ (అద్దెగర్భం) ప్రకటనలపై మోదీ సర్కార్ నిషేధం విధించింది. అదే సమయంలో పిల్లల్లో తెలివితేటల పెంపునకు సంబంధించిన ప్రకటనలపైనా గైడ్ లైన్స్ ఇచ్చింది. పూర్తి వివరాలివే..

‘సంతాన లేమితో బాధపడుతున్నారా? అయితే మా కేంద్రానికి వచ్చేయండి..’.. ‘పిల్లలు లేకపోవడం శాపంగా భావిస్తే దాని విముక్తి కోసమే మేమున్నాం..’.. ‘నగరంలోనే ది బెస్ట్ సంతాన సాఫల్య కేంద్రం మాది..’ అంటూ నిత్యం టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో హోరెత్తుతోన్న ప్రకటనలపై కేంద్రం కన్నెర్రచేసింది. సరోగసీ (అద్దెగర్భం) ప్రకటనలపై మోదీ సర్కార్ నిషేధం విధించింది. (Govt Bans Surrogate Ads) అదే సమయంలో పిల్లల్లో తెలివితేటల పెంపునకు సంబంధించిన ప్రకటనలపైనా గైడ్ లైన్స్ ఇచ్చింది. (Govt Curbs Misleading Ads)

‘మీ పిల్లలు చలాకీగా మారాలంటే ఫలానా పౌడర్‌ను పాలతో తాగించండి..’, ‘మీ పిల్లలు చదువుల్లో రాణించాలంటే ఈ హెల్త్ డ్రిక్స్ వాడండి..’ లాంటి ప్రకటనలపైనా చిన్నారుల్లో తెలివితేటలకు మూలం ఈ పదార్థాలే.. అంటూ ప్రతినిత్యం టీవీల్లో, పేపర్లలో, సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలపై కేంద్రం కన్నెర్రచేసింది. వాణిజ్య ప్రకటనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్‌కు అడ్డుకట్టవేయడం లక్ష్యంగా నిబంధనలను కఠినతరం చేసింది.

Farmers : పెద్ద రైతులకు షాక్.. చిన్న రైతుల నుంచే ధాన్యం కొనుగోలు : కేంద్రానికి CACP సంచలన ప్రతిపాదన


సరోగసీ(అద్దె గర్భం)పై యాడ్‌లను పూర్తిగా నిషేధించిన మోదీ సర్కార్.. పిల్లలకు సంబంధించిన ఉత్పత్తులు, అలాగే ఉచిత ఆఫర్ల గురించి రూపొందించే యాడ్స్‌ను నిశితంగా పరిశీలించాకే అనుమతులివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలను జారీచేసింది. చిన్నపిల్లల కోసం రూపొందించే యాడ్స్‌ విషయంలో కంపెనీలు ఇకపై జాగ్రత్తలు తీసుకోవాలని, గుర్తింపు పొందిన సంస్థల ద్వారా శాస్త్రీయంగా నిరూపితమైతే తప్ప... తమ ఉత్పత్తులు వాడితే పిల్లల్లో తెలివితేటలు, శారీరక సామర్థ్యం పెరుగుతాయంటూ యాడ్స్‌ తయారుచేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది.

Petrol Diesel : పెరిగిన ఇంధన డిమాండ్.. ముడి చమురు ధరల షాక్.. పెట్రో బాదుడు తప్పదు!


ఎలాంటి ఆధారాలు చూపించకుండా, తమ ఉత్పత్తులు వాడితే నలుగురిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందంటూ కంపెనీలు ప్రకటనలు ఇవ్వరాదని, అదేవిధంగా... పిల్లలు ఇప్పటికే తింటున్న సాంప్రదాయ, సహజమైన ఆహార పదార్థాల కంటే తమ ఆహార ఉత్పత్తులు మెరుగైనవనే అర్థం వచ్చే రీతిలో ప్రకటనలు ఉండకూడదని కేంద్రం నిర్దేశించింది. ఉత్పత్తిదారులు, సర్వీస్‌ ప్రొవైడర్లు, అడ్వర్టయిజర్లు, అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలు ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.

CM KCR : గజ్వేల్‌కు కేసీఆర్‌ గుడ్‌బై? -బీజేపీపై అనూహ్య వ్యూహం -కేటీఆర్‌కు జాక్‌పాట్?


ఏదైనా ప్రొడక్ట్‌ గురించి చెప్పేటప్పుడు దానిపై జరిగిన పరిశోధనల గురించి యాడ్‌లలో ప్రస్తావిస్తే... ఆయా పరిశోధనలను ఎవరు, ఎప్పుడు చేశారో కూడా వెల్లడించాలని, ఈ మార్గదర్శకాలు ప్రింట్‌, టెలివిజన్‌తోపాటు ఆన్‌లైన్‌ మీడియాకూ వరిస్తాయని కేంద్రం తన తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. యాడ్‌లలో నటించే ప్రొఫెషనల్స్‌ విషయంలోనూ కొన్ని మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఏదైనా ఉత్పత్తికి సంబంధించిన యాడ్‌లో నటించే విషయంలో భారతీయ ప్రొఫెషనల్స్‌పై నిషేధం ఉంటే... విదేశీ నటులకు కూడా ఆ ని షేధం వర్తిస్తుందని, విదేశీ ప్రొఫెషనల్స్‌తో ఆ యాడ్‌లను రూపొందించడానికి వీల్లేదని మోదీ సర్కార్ పేర్కొంది.

Currency Notes : కరెన్సీ నోట్లపై RBI సంచలనం.. గాంధీ బదులు ఠాగూర్, కలాం బొమ్మలు!


టీవీ చానళ్లు, పేపర్లు, ఆన్ లైన్ మీడియాలో వచ్చే యాడ్‌లో పేర్కొన్న అంశాలపై ఇచ్చే వివరణ(డిస్‌క్లెయిమర్‌)లో ఎలాంటి గందరగోళం ఉండకూడరాదని, యాడ్‌లో పేర్కొన్న విషయాలకు వ్యతిరేకంగా డిస్‌క్లెయిమర్లు ఉండొద్దని, సమాచారాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. యాడ్‌లో ప్రస్తావించే ఉత్పత్తులతో నటులకు, వ్యాపారస్తులకు, ఉత్పత్తిదారులకు ఏమైనా సంబంధం ఉంటే, ఆ వివరాలనూ వెల్లడించాలని, ఉత్పత్తులతో నటులకు ఎలాంటి సంబంధం ఉన్నా ప్రేక్షకులు దాన్ని అర్థం చేసుకునే రీతిలో యాడ్‌ను తయారుచేయాలని పేర్కొంది.

Political Successors : ఆ స్థానంలో దత్తన్న కూతురికి లైన్ క్లియర్? -గ్రేటర్‌లో వారసుల హోరు..


కాగా, ఈ మార్గదర్శకాలు ప్రైవేటు యాడ్స్‌తోపాటు ప్రభుత్వ సంస్థలు రూపొందించే యాడ్స్‌ కూ వర్తిస్తాయని మోదీ సర్కార్ స్పష్టం చేసింది. ఇప్పటివరకు 113 యాడ్‌ల విషయంలో సంబంధిత కంపెనీలకు నోటీసులు జారీచేసినట్టు సీసీపీఏ పేర్కొంది. వీటిలో 57 యాడ్స్‌ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని తెలిపింది. ఇటీవల పలు ప్రకటనలు వివాదాస్పదం అవుతోన్న నేపథ్యంతోపాటు పిల్లల విషయంలో తప్పుదోవ పట్టించే యాడ్స్ పెరుగుతోన్న క్రమంలో కేంద్రం ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

Published by:Madhu Kota
First published:

Tags: Ads, Centre government, Children, Television advertisements

ఉత్తమ కథలు