PM Modi gets teary eyed over Turkey situation : టర్కీకి ఆగ్నేయంగా..సిరియాకి ఉత్తరంగా ఉన్న సరిహద్దు ప్రాంతంలో నిన్న గంటల గ్యాప్‌లో వచ్చిన 3 భూకంపాలు(Turkey-syria earthquakes).. ఆ రెండు దేశాలనూ అల్లకల్లోలం చేశాయి. టర్కీ, సిరియా దేశాల్లో ఇప్పటిదాకా 5వేల మందికిపైగా మరణించారు. ఇంకా వేల మంది శిథిలాల కింద చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 20వేల మంది వరకు మృతుల సంఖ్య ఉండొచ్చనని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది. ఇదిలాఉండగా,టర్కీసిరియా దేశాల్లో సంభవించిన తీవ్ర భూకంపాల గురించి ఇవాళ భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారిగా ఇవాళ పార్లమెంట్ లో నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్(BJP Parliamentary Party Meeting) లో పాల్గొన్న ప్రధాని మోదీ(PM Modi).. టర్కీ,సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం గురించి బీజేపీ ఎంపీలకు వివరిస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.
తాను కూడా గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని భుజ్(లో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా ఈ రకమైన విధ్వంసాన్ని చూశానని, టర్కీలోని ప్రస్తుత పరిస్థితి భుజ్‌లో అలాంటి విధ్వంసాన్ని నాకు గుర్తు చేసింది అని మోదీ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. గుజరాత్‌లో ఏం జరిగిందో చూశామని, దానిని నిర్మించడానికి ఏళ్లు పట్టిందని, టర్కీ, సిరియా ప్రజల బాధను అర్థం చేసుకున్నామని ప్రధాని అన్నారు. ఇప్పటికే భారత్ నుంచి రెస్క్యూ టీమ్ లను టర్కీకి పంపామని చెప్పారు. అవసరమైతే, మేము మరిన్ని పంపుతాము అని మోదీ అన్నారు.
Earthquake : ఆ దేశాల్లో రోజూ భూకంపాలు .. అక్కడే ఎందుకీ పరిస్థితి?
ఈరోజు పార్లమెంట్‌లో జరిగిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో టర్కీలో జరిగిన విపత్తు గురించి పార్టీ సభ్యులకు తెలియజేస్తూ ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారని,ఎందుకంటే, 2001లో కచ్ ప్రాంతంలో 13000 మందికి పైగా మరణించిన భారీ భూకంపాన్ని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చూశారని సమావేశం తర్వాత బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు.
కాగా,టర్కీ,సిరియా దేశాల్లో భూకంపాల కారణంగా బిల్డింగ్ లు కుప్పకూలి శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందాలను టర్కీ పంపించాలని నిన్న ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని కూడా టర్కీ పంపిస్తున్నారు. గాయపడిన వారికి అవసరమైన ఔషధాలు, ఇతర సహాయక సామాగ్రి కూడా ఈ బృందాలు భారత్ నుంచి తీసుకెళ్లాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earthquake, Gujarat, Pm modi, Turkey