ప్రముఖ ఆర్ఎస్ఎస్ నేత పరమేశ్వరన్ కన్నుమూత...ప్రధాని మోదీ నివాళి...

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో ప్రముఖ సిద్ధాంతకర్త, మేధావి, రచయిత పి.పరమేశ్వరన్ కేరళలోని పాలక్కడ్ జిల్లా ఒట్టప్పాలంలో కన్నుమూశారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులతో పాటు ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి.


Updated: February 9, 2020, 8:47 PM IST
ప్రముఖ ఆర్ఎస్ఎస్ నేత పరమేశ్వరన్ కన్నుమూత...ప్రధాని మోదీ నివాళి...
ప్రముఖ ఆర్ఎస్ఎస్ నేత పరమేశ్వరన్ కన్నుమూత...ప్రధాని మోదీ నివాళి...
  • Share this:
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో ప్రముఖ సిద్ధాంతకర్త, మేధావి, రచయిత పి.పరమేశ్వరన్ కేరళలోని పాలక్కడ్ జిల్లా ఒట్టప్పాలంలో కన్నుమూశారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులతో పాటు ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. 93 ఏళ్ల పరమేశ్వరన్ కన్యాకుమారిలోని భారతీయ విచార కేంద్రం వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సంస్థ ద్వారా కేరళవాసుల్లో పలు సామాజిక కార్యక్రమాలను వ్యాప్తి చేసేందుకు కృషి చేశారు. భారతీయ జనసంఘ్ నేతగానూ పేరొందిన పరమేశ్వరన్ నాటి ప్రముఖులు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, వాజ్‌పాయి, ఎల్‌కె అద్వానీ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేశారు. 2018లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ తో గౌరవించింది. ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోడీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలైన నాయకులు సంతాపం తెలిపారు. పరమేశ్వరన్ మృతిపై ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా సంతాపం తెలిపారు. పరమేశ్వరన్ అంత్యక్రియలు వారి స్వస్థలంలో జరుగుతాయని సంఘ్ నాయకులు తెలిపారు.
Published by: Krishna Adithya
First published: February 9, 2020, 8:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading