Exclusive Interview with Modi | ఐదేళ్లలో నెట్వర్క్18 గ్రూప్‌కు మోదీ ఇంటర్వ్యూ ఇవ్వడం ఇది రెండోసారి. ఈ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ నెట్వర్క్18 గ్రూప్‌లోని 20 ఛానెళ్లలో సాయంత్రం 7 గంటలకు ప్రసారం కానుంది.
ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ న్యూస్18కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశంలో పలుచోట్ల తొలివిడత పోలింగ్‌కు ముహూర్తం దగ్గరపడ్డ సమయంలో ప్రధాని మోదీ తన బిజీ షెడ్యూల్లో న్యూస్18కు సమయం కేటాయించారు. అతిపెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు మోదీ. న్యూస్18 ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషీతో ప్రధాని మోదీ సంభాషించారు. ఐదేళ్లలో నెట్వర్క్18 గ్రూప్‌కు మోదీ ఇంటర్వ్యూ ఇవ్వడం ఇది రెండోసారి. ఈ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ నెట్వర్క్18 గ్రూప్‌లోని 20 ఛానెళ్లలో సాయంత్రం 7 గంటలకు ప్రసారం కానుంది. ఈ ఇంటర్వ్యూలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మోదీ మాట్లాడారు. ఎన్నికల తర్వాత కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. బీజేపీ పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకొకరి అవసరం ఉండదని, కేవలం ప్రభుత్వాన్ని నడపాలన్నది మా ఉద్దేశం కాదు.. యావత్ దేశాన్ని ముందుకు నడిపించాలన్నది మా లక్ష్యమన్నారు. అయితే కేసీఆర్, జగన్‌తో పొత్తు విషయాన్ని మాత్రం ఖండించలేదు. అవసరమైతే ఒక్క ఎంపీ సీటు ఉన్న పార్టీతో కూడా పొత్తు పెట్టుకుంటామని క్లారిటీ ఇచ్చారు మోదీ.
రాఫెల్ అంశంపై ప్రతిపక్షాలు పెద్దగా స్పందించలేదని, ఒక్కరు మాత్రం అదే అబద్ధాన్ని మళ్లీ మళ్లీ పలికారని పరోక్షంగా రాహుల్‌ను విమర్శించారు ప్రధాని మోదీ. ప్రతి చోటా ఈ అబద్ధాల్ని ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. రక్షణ కుంభకోణాలతో కాంగ్రెస్ నాశనమైందన్నారు మోదీ. చౌకీదార్ విషయానికొస్తే... 2013-2014లో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తనను కాపలాదారుగా భావించాలని ప్రజలను కోరాననీ, తాను దేశ సంపద తరలిపోకుండా చూస్తానని మాట ఇచ్చానని మోదీ తెలిపారు. తమ హయాంలో అవినీతికి అడ్డుకట్ట వేశామన్నారు. ఐదేళ్ల కాలంలో అవినీతికి వ్యతిరేకంగా అనేకసార్లు దాడులు చేశామన్నారు. మేం పోరాడకుంటే మధ్యప్రదేశ్ భోపాల్‌లో అక్రమాలు బయటపడేవా? అవినీతిపరుడు ఏం చెప్తున్నాడనేది మాకు అనవసరం. భోపాల్‌లో అధికారులు చేస్తున్న దాడులు అవినీతికి వ్యతిరేకం కాదా ? నేషనల్ హెరాల్డ్ కేసు మా హయాంలో జరిగిందా? లాలూ ప్రసాద్ యాదవ్ దాణా స్కాం మా పాలనలో జరిగిందా? అయినప్పటికీ... కోల్డ్‌స్టోరేజ్‌లో పడిఉన్న అవినీతి కేసులన్నింటికి బయటకు తీశామన్నారు. ఆ లాలూ ప్రస్తుతం జైల్లో ఉండగా... సోనియా రాహుల్‌ను ఉద్దేశిస్తూ... తల్లికొడుకులు బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు మోదీ.
భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీకి చెందినదని న్యూస్18 ఇంటర్వ్యూలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ పాలనను కొనసాగించే దిశగా తమ మేనిఫెస్టో ఉందన్నారు. మొదటిసారి తమ మేనిఫెస్టోలో 2022, 2024 నాటికి రోడ్‌మ్యాప్స్ రూపొందించామని చెప్పారు. దీనర్థం కేవలం ఐదేళ్లకు మాత్రమే కాదు... అంతలోపే తమ ప్రణాళికలు ఉన్నాయన్నారు. గతంలో ఏ పార్టీ ఇలా చేయలేదని మోదీ చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లలో సాధించాల్సినవాటి కోసం మేము 75 అడుగుల్ని మేనిఫెస్టోలో వివరించామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. కాశ్మీర్ ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 , 35లను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు మోదీ వివరించారు.
ఈ అంశాలతో పాటు ఈ ఎన్నికల్లో విజయావకాశాలు, బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు, మిగతా రాజకీయ పార్టీలతో పోలిస్తే బీజేపీ మేనిఫెస్టోకు ఉన్న ప్రత్యేకతలు, కాంగ్రెస్ ప్రకటించిన న్యాయ్ పథకం, రాఫేల్ యుద్ధ విమానాలపై ఆరోపణలు, కాశ్మీర్లో పీడీపీతో పొత్తు వివాదాస్పదంగా ముగియడం, కాశ్మీర్లో తీవ్రవాదం, పుల్వామాలో తీవ్రవాదదాడులు, బాలాకోట్‌పై సైన్యం మెరుపుదాడులు, అంతకుముందు జరిపిన సర్జికల్ స్ట్రైక్, పాకిస్తాన్‌తో తీవ్రవాద పోరు, చైనాతో దౌత్య సంబంధాలు, చైనావస్తువుల నిషేధం... ఇలా పలు అంశాలపై మోదీ తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు.
Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.