PM MODI EIGHT YEARS INDIA AIMS TO PROVIDE AFFORDABLE UNIVERSAL HEALTH COVERAGE TO EVERY CITIZEN GH VB
Modi@8: ప్రతి పౌరుడికి యూనివర్సల్ హెల్త్ కవరేజీ.. ఆ దిశగా అడుగులేస్తున్న భారత్..
ప్రతీకాత్మక చిత్రం
నాయకుడి సామర్థ్యం, ప్రభుత్వ పనితీరు ప్రతికూల పరిస్థితులు, ప్రపంచ ఆరోగ్య సంక్షోభాల సమయంలో బయటపడుతుంది. కరోనా మహమ్మారి విపత్తు దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను, సవాళ్లకు ప్రభుత్వం ఎదుర్కొనే తీరును పరీక్షించింది.
నాయకుడి సామర్థ్యం, ప్రభుత్వ పనితీరు ప్రతికూల పరిస్థితులు, ప్రపంచ ఆరోగ్య సంక్షోభాల సమయంలో బయటపడుతుంది. కరోనా(Corona) మహమ్మారి విపత్తు దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను, సవాళ్లకు ప్రభుత్వం(Government) ఎదుర్కొనే తీరును పరీక్షించింది. ప్రారంభ నెలలు కఠినమైన పరిస్థితులు ఉన్నా.. ప్రతి పౌరుడికి సార్వత్రిక, ఆచరణీయ, స్థిరమైన ఆరోగ్య సంరక్షణ(Healthcare)ను అందించే మార్గంలో ప్రభుత్వం(Government) చర్యలు తీసుకుంటోంది.
గత ఎనిమిది సంవత్సరాలలో కీలక పరిణామాలు..
కరోనా మహమ్మారి ప్రభావం దేశంపై తీవ్రంగా కనిపించింది. తక్షణం ప్రభుత్వం స్పందించి తీసుకొన్న చర్యలకు ప్రజలు ధన్యవాదాలు చెప్పాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, వ్యాధి లక్షణాలు గుర్తించడం వంటి వాటిపై ప్రభుత్వం విస్తృత అవగాహన కల్పించింది. కోవిడ్ కేర్ సెంటర్లలో భారీ మౌలిక సదుపాయాలను కల్పించింది. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులను ఏకం చేసి వేగంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేలా చర్యలు తీసుకొంది. ఔట్ పేషెంట్ కేర్, హాస్పిటల్ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, ICU, ఆక్సిజన్ సరఫరా, మందులు వంటివి సరిపడా అందేలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రపంచంలో వ్యాక్సిన్ క్యాపిటల్‌గా దేశం గుర్తింపు పొందడం అందరికీ గర్వకారణం.
* కొవిడ్ కారణంగానే డిజిటల్ హెల్త్‌కేర్ రంగం అభివృద్ధి చెందుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా టెలి-హెల్త్, టెలి-మెడిసిన్ రూపంలో డిజిటల్ హెల్త్‌కేర్ సేవలు విస్తరించాయి. ఈ సేవలు కొవిడ్ సమయంలో చాలా మందిని రక్షించాయి. ఆరోగ్య సంరక్షణను డిజిటలైజ్ చేయడం ప్రస్తుత కాలానికే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా అవసరం, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఒక గొప్ప ముందడుగు.
* దేశంలో ఆరోగ్య సంరక్షణలో ఉన్న ప్రధాన లోపాలలో ఒకటి సామాన్యులకు యూనివర్సల్ హెల్త్ కవరేజీ లేకపోవడం. దీని వల్ల ఎక్కువ మంది సొంత డబ్బును (ఆరోగ్య సంరక్షణ ఖర్చులలో 60 శాతానికి పైగా) ఖర్చు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం, ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సల్ హెల్త్ కవరేజీ పథకం. దాదాపు పేదరికంలో ఉన్న 500 మిలియన్ల మందికి ప్రయోజనాలు అందిస్తుంది. ఇది ఆరోగ్య సంరక్షణలో ఒక పెద్ద ముందడుగు. ఇప్పుడు ఇన్సూరెన్స్ పొందని మధ్యతరగతి వారికి కూడా వర్తిస్తుంది. USA, UKలోని NHS మెడికేర్కీ దీటుగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిపుణులు కోరుతున్నారు.
* విపత్తు సమయాల్లో ఏ దేశంలోనైనా రోగనిర్ధారణ రంగం, ఫార్మా, వ్యాక్సినేషన్ కంపెనీలు స్పందన ప్రధానం. ఇండియాలో అనేక సంయుక్త ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలు త్వరగా జరిగేలా చేశాయి.
* GDPలో 2 శాతం కంటే తక్కువగా ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు ఖర్చు చేసేది. అనేక బ్రిక్స్ దేశాలు GDPలో 4-5 శాతం కేటాయించాలని భావిస్తున్నాయి. అయినప్పటికీ మహమ్మారి దీనిని కొంతవరకు మార్చింది. గత సంవత్సరం ఆరోగ్య సంరక్షణ బడ్జెట్ కేటాయింపులో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఇది కూడా సరైన దిశలో తీసుకున్న నిర్ణయంగా పేర్కొనవచ్చు.
* ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం మరొక ప్రశంసనీయ విజయం. ముఖ్యంగా గ్రామీణ, పట్టణేతర ప్రాంతాల్లో వైద్యులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల సంఖ్యను పెంచడం దీని లక్ష్యం.
* మూడో వేవ్ సమయంలో పడకలు, నిధులు, మందులు లేదా వ్యాక్సిన్ల కొరత లేకుండా కూడా ప్రభుత్వం వేగవంతమైన పురోగతి కనబరచింది.
* ప్రజారోగ్య రంగంలో 2025 నాటికి TBని నిర్మూలించాలనే లక్ష్యం కూడా గమనించదగ్గ విజయం.
** పీడిస్తున్న సమస్యలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం
* అధిక శిశు ప్రసూతి, ప్రసవానంతర మరణాలు, పోషకాహార లోపం సమస్యలు దేశంలోని కొన్ని ప్రాంతాలను పీడిస్తూనే ఉన్నాయి. ప్రాథమిక, ప్రజా, నివారణ ఆరోగ్య వ్యూహాలను పటిష్టం చేయడం ఈ సమయంలో అవసరం. 2014లో మొదలైన మిషన్ ఇంద్రధనుష్ అనేది పిల్లలలో వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధులను దూరం చేసేందుకు తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం.
Modi@8: నరేంద్ర మోదీ స్ఫూర్తిని రగిలించే నాయకుడు: న్యూస్18 ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
నాన్-కమ్యూనికేషన్ వ్యాధులు (NCD), జీవనశైలి వ్యాధులపై తక్షణ శ్రద్ధ అవసరం.
ఆరోగ్యం, వనరులను నాశనం చేస్తున్నట్లుగా కనిపించే పర్యావరణ కాలుష్యం సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి.
ప్రస్తుతం దేశంలో మూడొంతుల తృతీయ శ్రేణిని కలిగి ఉన్న ప్రైవేట్ హెల్త్‌కేర్ రంగంలో వేగవంతమైన పురోగతి సాధించినప్పటికీ, నాణ్యమైన సేవల కోసం పేదలు పోరాడుతున్న ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ రంగం వెనుకబడి ఉంది. ప్రభుత్వం హెల్త్‌కేర్ బడ్జెట్‌ను గణనీయంగా పెంచినందున ఇది త్వరలో మారుతుందని ఆశిస్తున్నారు.
వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో అద్భుతమైన పురోగతిని సాధించింది. భారతదేశం ఇప్పుడు ప్రపంచ సమాజానికి ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని అందించే అగ్రగామిగా ఉన్నప్పటికీ, వైద్య విద్య అవకాశాలు అవసరమైన మేర లభించడం లేదు.
పేదరికం, ఆరోగ్య సంరక్షణ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. పేదరికాన్ని తగ్గించకపోతే, మన పౌరుల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం కష్టం.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.