PM Modi Independence Day Speech : Modi 76వ స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) సందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) సోమవారం ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎర్రకోటపై నుంచి మోదీ తొమ్మిదవ ప్రసంగం చేస్తున్నప్పుడు టెలిప్రాంప్టర్‌ను పక్కనబెట్టిన మోదీ ఉద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని టెలిప్రాంప్టర్‌ను పక్కన పెట్టారు. సుమారు 83 నిమిషాల ప్రసంగంలో ప్రధాని మోదీ... భారతదేశం యొక్క సంభావ్యత, ఏకీకృత శక్తి అవసరం గురించి, మహిళలను గౌరవించడం, దేశ స్వాతంత్య్రానికి దోహదపడిన స్వాతంత్ర్య సమరయోధులను కొనియాడారు. 2047లో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు అవుతుంది. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన భారతదేశంగా ఎదగాలని.. స్వాతంత్య్ర సమరయోధుల కలను సాకారం చేసేందుకు భారతీయులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐదు హామీలను ప్రధాని మోదీ నిర్దేశించారు. రాబోయే 25 ఏళ్ల జీవితాలను దేశాభివృద్ధికి అంకితం చేయాలని, బానిసత్వానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. మన భావనల్లో దేశం పట్ల ఐక్యత, బాధ్యతలను నెరవేర్చవలసిన అవసరాన్ని కూడా మోదీ నొక్కి చెప్పారు.
కేంద్రమైనా, రాష్ట్రమైనా దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రజలు వారి కలలు నెరవేరడం కోసం ఇక వేచి ఉండలేరని ప్రధాని మోదీ అన్నారు. మహిళా శక్తిని పెంచడమే కాకుండా భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప మహిళా నాయకుల సహకారాన్ని మోదీప్రశంసించారు. మహిళల పట్ల మన "ఆలోచనలో మార్పు" కోసం మోదీ విజ్ఞప్తి చేశారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో మహిళల పాత్రకు అభివాదం చేస్తూ... రాణి లక్ష్మీబాయి, ఝల్కారీబాయి, చెన్నమ్మ, బేగం హజ్రత్ మహల్ వంటి దేశంలోని మహిళల బలాన్ని గుర్తుచేసుకున్నప్పుడు ప్రతి భారతీయుడు గర్వంతో నిండిపోతాడని ప్రధాని మోదీ అన్నారు.
Popcorn In Multiflex : మల్టీప్లెక్స్ లో పాప్ కార్న్ ధర ఎక్కువగా ఉండటానికి కారణం ఇదే!
దేశం ముందున్న రెండు పెద్ద సవాళ్లు బంధుప్రీతి- రాజవంశం, అవినీతి అని మోదీ అన్నారు. వీటికి వ్యతిరేకంగా మనం కలిసి పోరాడాలని నొక్కి చెప్పారు. అవినీతికి పాల్పడి జైలుకెళ్లిన వారిపై సానుభూతి ఎందుకు ఉంటుందని మోదీ ప్రశ్నించారు. కొందరికి ఇళ్లు లేవని, మరికొందరికి అక్రమంగా సంపాదించిన ఆస్తులను నిల్వ చేసుకునేందుకు స్థలం సరిపోదని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో మనం నిర్ణయాత్మక దశలోకి ప్రవేశిస్తున్నామని.. ఇప్పుడు అవినీతికి పాల్పడిన ఉన్నతమైన లేదా శక్తిమంతులెవరూ తప్పించుకోలేరు అని ప్రధాన మంత్రి అన్నారు.
బంధుప్రీతి,రాజవంశం మరో పెద్ద సమస్య అని, ఇవి రాజకీయాల నుండి జీవితంలోని ఇతర రంగాలకు విస్తరించాయని, ప్రతిభను దెబ్బతీస్తున్నాయని ప్రధాని అన్నారు. ప్రతిభ ఉన్నవారికి, దేశ ప్రగతికి కృషి చేసే వారికి మనం అవకాశాలు ఇవ్వాలని... ప్రతిభే నవ భారతానికి ఆధారం అని ప్రధాని అన్నారు. "నేను బంధుప్రీతి, రాజవంశం గురించి మాట్లాడేటప్పుడు, నేను రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నానని ప్రజలు అనుకుంటారు. కాదు, దురదృష్టవశాత్తు రాజకీయాల యొక్క ఈ దుర్మార్గం ప్రతి సంస్థలో బంధుప్రీతిని పెంచింది" అని మోదీ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Independence Day 2022, Pm modi