news18-telugu
Updated: November 18, 2019, 5:34 AM IST
మోడీతో ఉద్ధవ్ థాక్రే (ఫైల్ ఫొటో)
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్డీయే సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. స్వల్ప విభేదాలున్నా దేశ ప్రయోజనాల కోసం సమిష్టిగా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కోరారు. మహారాష్ట్ర రాజకీయాలతో బీజేపీకి శివసేన దూరమైన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆదివారం జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ... మనది విశాల కుటుంబమని ప్రజల కోసం సమిష్టిగా పనిచేద్దామని ఎన్డీయే పక్షాలను కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో ఎన్డీయేకు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఎన్డీయే భేటీకి శివసేన హాజరుకాకపోవడం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఇక బీజేపీ కార్యనిర్వాహక సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలకు పార్టీ సభ్యుల హాజరు మెరుగ్గా ఉండేలా చూడాలని సూచించారు. సభలో కీలక అంశాలను లేవనెత్తాలని ఆయన పార్టీ ఎంపీలను ఆదేశించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 18, 2019, 5:20 AM IST