భారతదేశ విద్యా వ్యవస్థలో మార్పుల గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ ప్రభుత్వం తమ అవసరాలను తీర్చడానికి సేవకుల తరగతిని సృష్టించడానికి విద్యావ్యవస్థను ఇచ్చిందని అన్నారు. అలాంటి వ్యవస్థను ఇంకా మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)అన్నారు.తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో జాతీయ విద్యా విధానం అమలుపై ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు ఇలాంటి విద్యావిధానం (Education System) రూపొందించబడిందని.. ఇందులో విద్య ఉద్దేశ్యం ఉద్యోగం పొందడం మాత్రమే అని అన్నారు. దానిని బ్రిటిష్(British) వారు ఇచ్చారని.. వారి అవసరాలను తీర్చడానికి, వారి కోసం ఒక సేవక తరగతిని సిద్ధం చేయడానికి ఈ రకమైన విద్యా వ్యవస్థను రూపొందించారని చెప్పుకొచ్చారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అందులో కొన్ని మార్పులు వచ్చాయని.. కానీ చాలా మార్పులు మిగిలిపోయాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. బ్రిటీష్ వారు సృష్టించిన వ్యవస్థ భారతదేశం ప్రాథమిక స్వభావంలో ఎప్పటికీ భాగం కాదని అన్నారు. మన దేశంలో విద్యలో విభిన్న కళల భావన ఉండేదని.. . బనారస్‌లో మంచి గురుకులాలు, విద్యాసంస్థలు ఉండటం వల్ల మాత్రమే కాకుండా ఇక్కడ విజ్ఞానం, విద్య బహుముఖంగా ఉన్నందున కూడా విజ్ఞాన కేంద్రంగా ఉందని అన్నారు.
ఈ విద్యా విధానం మన స్ఫూర్తికి మూలం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. డిగ్రీ హోల్డర్ యువతను తయారు చేయడమే కాకుండా దేశం ముందుకు సాగేందుకు అవసరమైన మానవ వనరులను మన దేశానికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. మన ఉపాధ్యాయులు, విద్యా సంస్థలు ఈ తీర్మానానికి నాయకత్వం వహించాలని సూచించారు.
Delhi Schools: ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్‌లో కొత్త ప్రయోగం.. తల్లిదండ్రులు ఇక లైవ్‌లో చూడొచ్చు..
విద్యలో ఆధునికతకు అనుగుణంగా ఉండాల్సిన ఆవశ్యకతను ప్రధాని మరోసారి గుర్తు చేశారు. ప్రపంచం ముందుకెళ్తోందని.. అందులో మన ఎక్కడున్నారో మనం తెలుసుకోవాలని అన్నారు. రాబోయే 15-20 సంవత్సరాలలో భారత్ మనం సిద్ధం చేయాల్సిన పిల్లల చేతుల్లో ఉంటుందని... ఇది మన గొప్ప బాధ్యత అని చెప్పారు. అదే బాటలో మన విద్యాసంస్థలు కూడా తమను తాము ప్రశ్నించుకోవాలని అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.