Home /News /national /

PM MODI COMMENTS ON FREEBIES AND SLAMS CONGRESS AND OPPOSITION OVER PROTESTS IN BLACK DRESS MKS

PM Modi : ఉచిత పథకాలపై ప్రధాని మోదీ ఆవేదన.. విపక్షాలది చేతబడి కుతంత్రమంటూ..

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

పేదలకు ఉచిత పథకాలపై న్యాయస్థానాల్లో, రాజకీయ నేతల మధ్య వివాదం ముదురుతోన్న తరుణంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని హెచ్చరించారు. విపక్షాల నిరసనలపైనా ఆయన మండిపడ్డారు..

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India
పేదలకు ఉచిత పథకాల (Freebies)అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM MOdi) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు ఫ్రీబీస్ ప్రకటించకుండా ఎన్నికల సంఘం కట్టడి విధించేలా ఆదేశాలివ్వాలంటూ బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కార్పోరేట్లకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన మోదీ సర్కార్ పేదల విషయంలో ఇలా మాట్లాడటం సబబు కాదని విపక్షాలు ఎదురుదాడి చేస్తోన్న తరుణంలో ప్రధాని తాజా కామెంట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. ధరల పెరుగుదలపై కాంగ్రెస్ సహా విపక్షాలు చేపట్టిన నిరసనలపైనా మోదీ మండిపడ్డారు.

ఉచిత పథకాలతో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఉచితాలు దేశాభివృద్ధిని అడ్డుకుంటాయని, పెట్టుబడులు పెట్టేందుకు వనరులు లేకుండా చేస్తాయని హెచ్చరించారు. ఉచితాలు మన పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, దేశం స్వయం సమృద్ధి సాధించకుండా అడ్డుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Freebies : ఉచిత పథకాలతో ప్రమాదం.. అవి భారత ఆర్థిక గమనాన్ని ఎలా దెబ్బతీస్తాయంటే..


పానిపట్‌లోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ రిఫైనరీలో ఏర్పాటు చేసిన ఇథనాల్‌ ప్లాంట్‌ను మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఉచిత పథకాలు, ధరల పెరుగుదలపై ఇటీవల కాంగ్రెస్ చేసిన నిరసనలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉచిత పథకాలతో సంక్షేమం వట్టిమాట! ఇదిగో రుజువులు..పేదలకు సబ్సిడీ కొనసాగాలంటే ఇలా..


కాంగ్రెస్‌ నేతలు నల్లదుస్తులు ధరించి గత శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో చేసిన ఆందోళనను ఉద్దేశించి మోదీ తీవ్రంగా స్పందించారు. ‘‘ఆగస్టు 5న కొంతమంది బ్లాక్‌ మ్యాజిక్‌ను వ్యాపింప చేద్దామని చేసిన ప్రయత్నాన్ని మనమంతా చూశాం. నల్ల దుస్తులు ధరిస్తే తమలోని నిరాశ, నిస్పృహ అంతమైపోతాయని వాళ్లు భావించారు. కానీ, చేతబడి, గారడీలు, మూఢనమ్మకాలతో ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందలేమనే విషయం వాళ్లకి తెలియదు’’అని పేర్కొన్నారు. బ్లాక్‌ మ్యాజిక్‌ వాళ్ల కష్టకాలానికి ముగింపు పలకదని కాంగ్రెస్ ను ఉద్దేశించి అన్నారు.



పేదల సంక్షేమం కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశానికి ప్రమాదకరమని గత నెలలోనూ ప్రధాని మోదీ ఓ సందర్భంలో అన్నారు. ఉచిత హామీలను తాయిలాల సంస్కృతిగా, గుజరాతీ పిల్లల మిఠాయి రేవడీతో బీజేపీ నేతలు పోల్చారు. ఫ్రీబీస్ ను ప్రోత్సహించేవారు ఎక్స్‌ప్రెస్‌వేలు, ఎయిర్‌పోర్టులు నిర్మించలేరని ఎద్దేవా చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఎత్తున ఉచిత పథకాల హామీలు ప్రకటించిన తర్వాత బీజేపీ ఎదురుదాడిని తీవ్రతరం చేసింది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Pm modi, Schemes

తదుపరి వార్తలు