హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi : కొవిడ్ కట్టడిపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు.. రాష్ట్రాలకు హెల్త్ మినిస్టర్ బ్రీఫింగ్ రేపు

PM Modi : కొవిడ్ కట్టడిపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు.. రాష్ట్రాలకు హెల్త్ మినిస్టర్ బ్రీఫింగ్ రేపు

దేశంలో ఇప్పటికే కొవిడ్ మూడో వేవ్ ప్రారంభమైందన్న నిపుణుల హెచ్చరికలు, వివిధ రాష్ట్రాల్లో దాదాపు లాక్ డౌన్ తరహా ఆంక్షలు, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు తదితర అంశాల నేపథ్యంలో వైరస్ కట్టడికి దేశం అనుసరించాల్సిన తదుపరి కార్యాచరణపై ప్రధాని ఇవాళ(ఆదివారం) అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఇంకా చదవండి ...

  భారత్ లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండటం, కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటికే కొవిడ్ మూడో వేవ్ ప్రారంభమైందన్న నిపుణుల హెచ్చరికలు, వివిధ రాష్ట్రాల్లో దాదాపు లాక్ డౌన్ తరహా ఆంక్షలు, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు తదితర అంశాల నేపథ్యంలో వైరస్ కట్టడికి దేశం అనుసరించాల్సిన తదుపరి కార్యాచరణపై ప్రధాని ఇవాళ(ఆదివారం) అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య శాఖ, నీతి ఆయోగ్ తదితర విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షలో మోదీ పలు కీలక ఆదేశాలిచ్చారు.

  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కీలక సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, ఏవియేషన్ సెక్రటరీ, హోం సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, రైల్వే బోర్డు ఛైర్మన్‌తో పాటు ఇతరులు ఉన్నారు. అంతర్జాతీయ ప్రయాణాల వల్లే దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటం, రైల్వే ప్రయాణాలు జోరందుకున్న దశలోనే వైరస్ మళ్లీ విజృంభించడంతో ప్రజారవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించే అంశంపై సమీక్షలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

  కొవిడ్ మూడో వేవ్ ఉధృతంగా ఉండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడం, మెడికల్ ఆక్సిజన్ సరఫరా, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన మందుల పంపిణీ, ముందస్తు నిల్వలు తదితర అంశాలపైనా ప్రధాని మోదీ సూచనలు చేశారని తెలుస్తోంది. కొవిడ్ వ్యాప్తిపై సమీక్షలో ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాని చెప్పిన విషయాలను రాష్ట్రాలకు వివరించేందుకుగానూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ రేపు(సోమవారం) అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

  రాజధాని ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా కరోనా ఉధృతంగా వ్యాపిస్తుండటం, ఒక్క పార్లమెంట్ భవంతిలోనే సుమారు 400 మంది సిబ్బంది వైరస్ బారినపడిన క్రమంలో రాజ్యసభలో 50 శాతం ఉద్యోగులే ఆఫీసుకు రావాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. మరోవైపు, గర్భిణులు, దివ్యాంగులు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ఇస్తున్నట్లు కేంద్రం ఆదివారం నాడు ఒక ప్రకటన చేసింది. కంటైన్మెంట్ జోన్లలో నివసించే ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  First published:

  Tags: Assembly Election 2022, Corona third wave, Coronavirus, Covid, India, Lockdown, Omicron, Pm modi

  ఉత్తమ కథలు