2002 గుజారాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఓవేపు సెగలు రేపుతుండగా.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. అలాంటి ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు. ఢిల్లీ కరియప్ప గ్రౌండ్స్‌లో NCC ర్యాలీలో ప్రసంగించారు మోదీ.
#WATCH | PM Narendra Modi inspects the Guard of Honour at the National Cadet Corps (NCC) rally at Cariappa Ground in Delhi (Source: DD) pic.twitter.com/xo82CP9BEV
— ANI (@ANI) January 28, 2023
బీబీసీ డాక్యుమెంటరీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారా?
2002 నాటి గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ గురించి మోదీ పరోక్షంగా ప్రస్తావించారన్న చర్చ జరుగుతోంది. దేశంలో మళ్ళీ చీలికలు తెచ్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు మోదీ. కానీ వాళ్ల ప్రయత్నాలు విఫలమవుతాయని విమర్శించారు. దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మనమంతా సమైక్యతా మంత్రాన్నే జపిస్తున్నామని.. అందుకే మనల్ని చీల్చడం ఎవరి తరం కాదన్నారు మోదీ.
తల్లి పాలలో ఎవరూ విషం కలపలేరు
'మా కే దూద్ మెయిన్ కభీ దరర్ నహీ హో శక్తి' అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. తల్లి పాలలో ఎవరూ విషం కలపలేరంటూ ఫైర్ అయ్యారు మోదీ. భరతమాత బిడ్డలను వేరు చేయడం ఎవరి వల్ల కాదన్నారు. ఏది ఏమైనా.. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. దేశ ప్రజలు ఐకమత్యంతోనే ఉంటారని కుండబద్దలు కొట్టారు మోదీ. ఇక గుజరాత్ అల్లర్లకు మోదీనే బాధ్యుడని బీబీసీ ఇటీవల ‘ఇండియా: ది మోదీవశ్చన్’ పేరుతో డాక్యుమెంటరీ విడుదల చేసింది. అయితే ఇందులో అన్ని అవాస్తవాలే ఉన్నాయని బీజేపీ వర్గాల నుంచి విమర్వలు వ్యక్తమవుతున్నాయి. దేశాన్ని విభజించేందుకే ఈ డాక్యుమెంటరీ అని ఆరోపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరిచుకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi