Home /News /national /

PM MODI CALLS FOR REFORMS AT 2ND GLOBAL COVID SUMMIT PAH

PM Modi: రెండో గ్లోబల్ కోవిడ్ సమ్మిట్.. ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన కీలక అంశాలు..

ప్రధాని మోదీ (ఫైల్)

ప్రధాని మోదీ (ఫైల్)

Covid: ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ గ్లోబల్ సమ్మిట్ వర్చువల్ విధానంలో గురువారం పాల్గోన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి అనేక సూచనలు చేశారు.

ప్రస్తుతం మరోసారి కోవిడ్ మహమ్మారి (Covid) కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుతున్నాయి. ఇప్పటికే కరోనా ఫోర్త్ వేవ్ లో ప్రవేశించిందని అనేక మంది సైంటిస్టులు తెలిపారు. చైనా లాంటి (China) అనేక నగరాలలో కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడ లాక్ డౌన్ ను పాటిస్తున్నారు.

మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ, (Narendra modi)  గురువారం రెండో కోవిడ్ సమ్మిట్ వర్చువల్ విధానం లో గురువారం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కరోనాను ఎదుర్కొవడానికి మరోసారి అనేక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కరోనా ను (Corona virus)  జయించడానికి బలమైన ప్రపంచ ఆరోగ్య భద్రత ప్రమాణాలను పాటించాలన్నారు. కొవిడ్ తో ప్రజలు జీవనం అస్తవ్యస్తమైందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని అన్నారు.

ఇప్పటికే భారత్ వ్యాక్సినేషన్  ప్రొగ్రామ్ ను పెద్ద ఎత్తున చేపట్టిందని అన్నారు. ఇప్పటికే దాదాపు.. 90 శాతానికి పైగా ప్రజలు టీకాలు వేసుకున్నారని అన్నారు. అదే విధంగా, కరోనా ను ఎదుర్కొవడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకొవడానికి సాంప్రదాయ ఔషధాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. దీంతో పాటు, కరోనాను ఎదుర్కొవడానికి మరిన్ని వ్యాక్సిన్ లు అందుబాటులోనికి రానున్నాయని అన్నారు. వైరస్ తరచుగా రూపాంతరం చెందుతూ.. వ్యాక్సిన్ కు నిరోధకత చూపిస్తుందని అన్నారు. శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలతో కరోనాను పూర్తి స్థాయిలో ఎదుర్కొవడానికి వ్యాక్సిన్ తయారు చేస్తున్నారని అన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ... గత ఏడాది సెప్టెంబర్ 22న బిడెన్ హోస్ట్ చేసిన కోవిడ్‌పై మొదటి గ్లోబల్ వర్చువల్ సమ్మిట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే.
Published by:Paresh Inamdar
First published:

Tags: Covid, Covid situation, Delhi, Narendra modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు