ప్రతిపక్షాలు సిగ్గుతో మునిగిపోవాలి...మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ

డూబ్ మరో అంటూ ఆయన ప్రతిపక్షాల నాయకులపై ఎదురు దాడి చేశారు. శివాజీ పుట్టిన ఈ గడ్డ మీద కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా మాట్లాడడం తనను ఆందోళనకు గురిచేసిందని ఆయన అన్నారు.

news18-telugu
Updated: October 16, 2019, 9:47 PM IST
ప్రతిపక్షాలు సిగ్గుతో మునిగిపోవాలి...మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ
ప్రధాని మోదీ
  • Share this:
ఆర్టికల్ 370 అధికరణాన్ని రద్దు చేయడంపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్, ఎన్‌సిపిపై విరుచుకుపడ్డారు. ఎక్కడైనా మునగిపోండి అని హిందీలో ఆయన ఎదురుదాడి చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్రకు, ఆర్టికల్ 370కి సంబంధం ఏముందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని, కుటుంబ రాజకీయాలలో కూరుకుపోయిన వ్యక్తులకు, తమ రాజకీయ లబ్ధి కోసం మహారాష్ట్రకు, కశ్మీరుకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. డూబ్ మరో అంటూ ఆయన ప్రతిపక్షాల నాయకులపై ఎదురు దాడి చేశారు. శివాజీ పుట్టిన ఈ గడ్డ మీద కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా మాట్లాడడం తనను ఆందోళనకు గురిచేసిందని ఆయన అన్నారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 21న జరగనున్నది. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడనున్నాయి.
Published by: Krishna Adithya
First published: October 16, 2019, 9:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading