హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi Cabinet: అధిక విద్యావంతులకు మంత్రి పదవులు. ప్రధాని మోదీ వ్యూహాత్మక అడుగులు

PM Modi Cabinet: అధిక విద్యావంతులకు మంత్రి పదవులు. ప్రధాని మోదీ వ్యూహాత్మక అడుగులు

అధిక విద్యావంతులకు మంత్రి పదవులు.

అధిక విద్యావంతులకు మంత్రి పదవులు.

PM Modi Cabinet 2.0: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... అధిక విద్యావంతులకు మంత్రి పదవులు ఇచ్చారు. దీని వెనక వ్యూహంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

PM Modi Cabinet 2.0: బాగా చదువుకున్న వారికి సరైన బాధ్యతలు అప్పగిస్తే... వారు మరింత రాణిస్తారు. ఆయా పదవులకు తగిన న్యాయం చేస్తారు... ఈ సార్వజనీన సూత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ... తాజా కేబినెట్ విస్తరణలో అనుసరించినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే... కొత్త మంత్రులంతా అధిక విద్యావంతులై ఉన్నారు. వారిలో కొందరైతే... విదేశాల్లో కూడా చదివిన వారు ఉన్నారు. చాలా మంది పీహెచ్‌డీ, ఎంబీబీఎస్, పీజీ, లా చదివిన వారు ఉన్నారు. ప్రపంచ బెస్ట్ యూనివర్శిటీల్లో చదివిన వారు ఉన్నారు. కొందరికి వృత్తి నైపుణ్యాలు కూడా ఉన్నాయి. మొత్తం 43 మంది కొత్త మంత్రుల్లో 15 మందికి క్యాబినెట్ ర్యాంక్ దక్కింది. తద్వారా... అత్యుత్తమమైన వారిని ప్రధాని మోదీ ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తోంది.

రైల్వే, ఐటీ శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్... ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఐఐటీ కాన్పూర్ నుంచి ఎంటెక్ చేసి... IASకి ఎంపికయ్యారు. వార్టాన్ స్కూల్ నుంచి MBA సాధించారు. డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్... గౌహతి యూనివర్శిటీలో పీజీ చేసి... మణిపూర్ యూనివర్శిటీ నుంచి phd పొందారు. అక్కడే రిజిస్ట్రార్‌గా పనిచేశారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్కళ్ వర్శిటీలో ఆంథ్రోపాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. జ్యోతిరాదిత్య మాధవరావు సింథియా... హార్వార్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ చేశారు. అలాగే స్టాన్‌ఫోర్డ్ వర్శిటీలో ఎంబీఏ చేశారు. రామచంద్రప్రసాద్ సింగ్ యూపీ కేడర్ IAS అధికారిగా చేశారు.

ఇది కూడా చదవండి: Weekly Horoscope: వార ఫలాలు... జులై 11 నుంచి జులై 17 వరకు రాశి ఫలాలు

కోడెర్మా నుంచి ఎంపీగా ఎన్నికై... మంత్రిగా మారిన అన్నపూర్ణాదేవి... రాంచీ యూనివర్శిటీలో ఏంఏ చేశారు. అలాగే... అసోం నుంచి వచ్చిన శర్బానంద్ సోనోవాల్ దిబ్రూఘర్ యూనివర్శిటీ నుంచి LLB డిగ్రీ పట్టా పొందారు. రామచంద్రప్రసాద్ సింగ్ JNU నుంచి MA చేశారు. అలాగే... యూపీ కేడర్ IAS అధికారిగా పనిచేసి... పాలిటిక్స్‌లోకి వచ్చారు. బెంగాల్ నుంచి వచ్చిన డాక్టర్ సుభాష్ సర్కార్... కోల్‌కతా యూనివర్శిటీలో mbbs చదివారు. LJD నేత పశుపతి కుమార్ పరాస్... భాగల్‌పూర్ వర్శిటీ నుంచి B.Ed చేశారు. పంకజ్ చౌదరి గోరఖ్‌పూర్ వర్శిటీ నుంచి BA చేశారు.

మీనాక్షి లేఖి ఢిల్లీ యూనివర్శిటీ నుంచి LLB పట్టా పొందారు. భూపేంద్ర యాదవ్ అజ్మీర్ వర్శిటీ నుంచి LLB పట్టా పొందారు. రాజీవ్ చంద్రశేఖర్ చికాగో, ఇల్లినాయస్ ఇన్‌స్టిట్యూట్ల నుంచి మాస్టర్స్ డిగ్రీలు పొందారు. అనురాగ్ ఠాకూర్... జలంధర్‌లో బీఏ చదివారు. అనుప్రియపటేల్... MB చదివి... MA సైకాలజీ చేశారు. శోభా కరంద్లాజే... మంగళూరు యూనివర్శిటీ నుంచి PG చేశారు. బీపీ సింగ్ వర్మ... MA LLB చదివారు.

వీరేంద్ర కుమార్ హరిసింగ్ గౌర్ వర్శిటీ నుంచి PHD పూర్తి చేశారు. భగవంత్ ఖూబా... తుముకూరు ఇంజినీరింగ్ కాలేజీ నుంచి BE చేశారు. పంచాయతీ రాజ్ సహాయ మంత్రి కపిల్ పాటిల్... ముంబై వర్శిటీ నుంచి BA పట్టా పొందారు.

ఇది కూడా చదవండి: World population day: పెరిగిపోతున్న జనాభా... మరో 30 ఏళ్లలో 900 కోట్లకు చేరిక!

నితీశ్ ప్రామాణిక్... బెంగాల్‌లోని బాలాకురా జూనియర్ బేసిక్ స్కూల్‌లో BCA చేశారు. మంత్రి ఎస్పీ సింగ్ భాగెల్... BLLB చేశారు. ప్రతిమా భౌమిక్... అగర్తలా కాలేజీలో బయో సైన్స్ చదివారు. మహేంద్ర ముంజపారా... గుజరాత్ యూనివర్శిటీ నుంచి జనరల్ మెడిసిన్‌లో MD చేశారు. ఎల్.మురుగన్ మద్రాస్ యూనివర్శిటీ నుంచి PHD చేశారు. దర్శనా జర్దోష్... బీకామ్ చదివారు. నారాయణ స్వామి బీఏ డిగ్రీ చదివారు.

ఇలా విద్యాధికులను కేబినెట్ లోకి చేర్చుకోవడం ద్వారా... దేశాభివృద్ధికి సరైన నిర్ణయాలు తీసుకోవడంతోపాటూ... వచ్చే 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీని మరోసారి గెలిపించడమే వ్యూహంగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

First published:

Tags: Cabinet Reshuffle, Central cabinet, PM Narendra Modi