PM Modi Birthday: నమో యాప్ ద్వారా ప్రధాని మోదీని ఇలా విష్ చేయండి

ఎంతో మంది నమో యాప్ ద్వారా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారని.. మీరూ వారిలో ఒకరిగా ఉండవచ్చని బీజేపీ ట్వీట్ చేసింది.

news18-telugu
Updated: September 17, 2020, 11:50 AM IST
PM Modi Birthday: నమో యాప్ ద్వారా ప్రధాని మోదీని ఇలా విష్ చేయండి
ప్రధాని నరేంద్ర మోదీ
  • Share this:
భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజును బీజేపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. పలు సేవా కార్యక్రమాలతో తమ అభిమాన నేత బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు, పోస్ట్‌ల మోత మోగిస్తున్నారు. ఐతే నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పదలచుకున్న వారు నమో (NarendraModi) యాప్ ద్వారా విష్ చేయాలని బీజేపీ తెలిపింది. ఎంతో మంది నమో యాప్ ద్వారా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారని.. మీరూ వారిలో ఒకరిగా ఉండవచ్చని ట్వీట్ చేసింది.

ప్రధాని మోదీని ఇలా విష్ చేయండి:

1. ముందుగా నమో యాప్ డౌన్‌లోడ్ చేయాలి.

2. న్యూ ఇండియా విషెస్ నమో మాడ్యూల్‌లోకి వెళ్లాలి.

3. అక్కడ ప్రధాని మోదీకి మీ సందేశం రాసి పంపవచ్చు.4. ఒకే ఒక్క క్లిక్‌తో నరేంద్ర మోదీకి శుభాంకాంక్షలు తెలపవచ్చు.

5. అంతేగాదు ఇతరులు చెప్పిన విషెస్‌ను కూడా వీక్షించవచ్చు.
Published by: Shiva Kumar Addula
First published: September 17, 2020, 11:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading