PM Modi Birthday: ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు.. ఆ ఫొటోలను షేర్ చేసిన పవన్ కల్యాణ్

ఫ్రధాని నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధానికి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

  • Share this:
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధానికి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ప్రధాని మోదీకి జన్మదిన(PM Modi Birthday) శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind).. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతున్ని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ప్రధాని మోదీకి(Narendra Modi) జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ‘ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. మీ అపారమైన కృషి‌, సమర్థ నాయకత్వం, అంకితభావం దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుంది. మీరు ఇలానే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా’అని వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ట్వీట్ చేశారు.

    మోదీ జీవితంలోని ప్రతి క్షణం పేదలు, రైతుల సేవకు అంకితం చేయబడింది.. అమిత్‌ షా
    ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘దేశానికి ఇష్టమైన నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షులు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను’అని అమిత్ షా ట్వీట్ చేశారు. మోదీ నాయకత్వంలో దేశం బలమైన, నిర్ణయాత్మక నాయకత్వాన్ని పొందింది. మోదీ పాలనలో దశాబ్దాలుగా దేశంలో హక్కులకు దూరంగా ఉన్న కోట్లాది మంది పేద ప్రజలకు గౌరవప్రదమైన జీవితం అందించడమే కాకుండా.. ప్రజాస్వామిక నాయకత్వం అంటే ఏమిటో ప్రపంచానికి చూపించారని అన్నారు.









    ప్రధాని మోదీ సంకల్పం, అంకితభావం.. దేశ ప్రజలలో కొత్త శక్తిని విశ్వాసాన్ని సృష్టించిందని అన్నారు. ఈ కారణంగానే దేశం కొత్త రికార్డులు నెలకొల్పి.. స్వయం సమృద్ది వైపు నడుస్తోందని చెప్పారు. మోదీ జీవితంలో ప్రతి క్షణం పేదలు, రైతులు, వెనకబడిన వారి సేవకు అంకితం చేయబడిందని తెలిపారు. అలాగే మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవ సమర్పణ పేరుతో నిర్వహిస్తున్న కార్యాక్రమాల్లో పాల్గొనాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

    PM Narendra Modi Birthday: భారీగా కోవిడ్ వ్యాక్సినేషన్‌.. 20 రోజులు పాటు మోదీ పుట్టినరోజు వేడుకలు.. ఇంకా మరెన్నో కార్యక్రమాలు

    కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘Happy birthday, Modi ji’అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.



    తెలుగు రాష్ట్రాల నుంచి..
    తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌.. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎక్కువ కాలం దేశానికి సేవలందించాలి’ అని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.





    ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షులు తెలియజేశారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత ప్రయాణం నిస్వార్థ, నిబద్ధత, కరుణతో కూడిన సేవ యొక్క సందేశం. ఈ రోజు మన ప్రియతమ నాయకుడు, భారతదేశ ప్రధాన సేవక్ నరేంద్ర మోదీ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం నేను ప్రార్థిస్తున్నాను’అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.





    జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘71వ జన్మదినం జరుపుకుంటున్న నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలతో కూడిన చిరాయువును ఆ ఆదిపరాశక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా మోదీ గారితో కలసి అనేక సభలలో ప్రచారం చేసే అవకాశం నాకు లభించింది. ఆయనలోని ఆకర్షణ శక్తిని సునిశితంగా గమనించడానికి ఆ ప్రయాణం నాకు దోహదపడింది’అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: