#HowdyModi : ట్రంప్ సాక్షిగా పాకిస్థాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసిన మోదీ...

ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు ప్రెసిడెంట్ ట్రంప్ సహాయసహకారాలు అందిస్తాను అన్నారని, వారికి చాలా ధన్యవాదాలు అని మోదీ పేర్కొన్నారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూకాశ్మీర్ లో దుర్వినియోగానికి గురైందని, అందుకే రద్దు చేశామని మోదీ అన్నారు.

news18-telugu
Updated: September 23, 2019, 9:03 AM IST
#HowdyModi : ట్రంప్ సాక్షిగా పాకిస్థాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసిన మోదీ...
మోదీ, ట్రంప్
  • Share this:
9/11 ఉగ్రదాడులు, 26/11 ముంబై ఉగ్రదాడుల మూలం ఒక్కటేనని ప్రధాని మోదీ గుర్తుచేశారు. హ్యూస్టన్ వేదికగా జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాక్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు ప్రెసిడెంట్ ట్రంప్ సహాయసహకారాలు అందిస్తాను అన్నారని, వారికి చాలా ధన్యవాదాలు అని మోదీ పేర్కొన్నారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూకాశ్మీర్ లో దుర్వినియోగానికి గురైందని, అందుకే రద్దు చేశామని మోదీ అన్నారు. అలాగే ఉగ్రమూలాలు ఏదేశంలో ఉన్నాయో ప్రపంచానికి తెలుసని పరోక్షంగా పాకిస్థాన్‌కు చురకలు అంటించారు.

ఇదిలా ఉంటే అమెరికా హ్యూస్టన్‌ ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో హౌడీ-మోదీ సభకు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తనకు అపూర్వ స్వాగతం లభించిందంటూ ఆయన హ్యూస్టన్‌ వాసులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. హౌడీ-మోదీ కార్యక్రమానికి వచ్చిన ట్రంప్‌‌కు ప్రధాని మోదీ, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. సభలో భారత్‌, అమెరికా దేశాల జాతీయ గీతాలు ఆలపించారు.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading