Home /News /national /

PM MODI AT RED FORT INDIA NEVER POSED THREAT TO ANY COUNTRY HAS FOLLOWED IDEALS OF SIKH GURUS PVN

PM Modi : భారత్ అనుసరించేది వారి ఆదర్శాలే..ఏ దేశానికీ భారత్ ముప్పు కాదు

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

PM Modi At Red Fort : భారత్‌ ఎళ్లవేళలా ప్రపంచ సంక్షేమం గురించే ఆలోచిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌... ఏ ఇతర దేశానికి, సమాజానికీ ఏనాడూ ముప్పుగా పరిణమించలేదని మోదీ ఉద్ఘాటించారు. మొత్తం ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత్‌ అని తేల్చిచెప్పారు.

ఇంకా చదవండి ...
PM Modi At Red Fort : భారత్‌ ఎళ్లవేళలా ప్రపంచ సంక్షేమం గురించే ఆలోచిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌... ఏ ఇతర దేశానికి, సమాజానికీ ఏనాడూ ముప్పుగా పరిణమించలేదని మోదీ ఉద్ఘాటించారు. మొత్తం ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత్‌ అని తేల్చిచెప్పారు. సిక్కు గురువుల ఆదర్శాలను భారత్ అనుసరిస్తోందని అన్నారు. తొమ్మిదో సిక్కుగురువు తేగ్‌ బహదూర్‌ 400వ జయంతిని పురస్కరించుకొని ఎర్రకోటలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. సిక్కు గురువుల ఆదర్శాలను దేశం పాటిస్తుందని అన్నారు. తేగ్‌ బహదూర్‌ త్యాగం ఎన్నో తరాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఎర్రకోట సమీపంలోని గురుద్వారా సిస్‌గంజ్‌ సాహిబ్‌ గురు తేగ్‌ బహదూర్‌ చిరస్మరణీయ త్యాగానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. మనదేశ గొప్ప సంస్కృతిని రక్షించేందుకు తేగ్‌ బహదూర్‌ చేసిన మహోన్నత త్యాగాన్ని ఈ పవిత్ర గురుద్వారా తెలియజేస్తోందన్నారు. అప్పట్లో దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లిందని, మతం పేరిట సామాన్య ప్రజలపై హింసాకాండ సాగించారన్నారు. అలాంటి సమయంలో గురు తేగ్‌ బహదూర్‌ రూపంలో దేశానికి ఒక ఆలంబన దొరికిందన్నారు. సామాజిక బాధ్యత కోసం గురువులు తమ జీవితాలను సమర్పించారని మోదీ తెలిపారు. గురువులు తమ శక్తిని సేవా మాధ్యమంగా మలుచుకున్నారని, దురాఘతాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా దేశాన్ని గొప్ప శక్తి నడిపించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. ప్రత్యేక తేగ్‌ బహదూర్‌ స్మారక నాణేన్ని, తపాళా బిళ్లను విడుదల చేశారు.

కాగా, సూర్యాస్తమయం తర్వాత ఎర్రకోట నుంచి ప్రసంగించిన మొదటి ప్రధాని మోదీ కావడం విశేషం. కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రిత్వ శాఖ, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశ, విదేశాల్లోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గురుతేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్ కార్యక్రమాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఢిల్లీ పోలీసులు సహా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన వెయ్యి మంది సిబ్బందితో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఎర్రకోట కాంప్లెక్స్‌లో దాదాపు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ALSO READ Air India : అంత పెద్ద ఎయిరిండియా ఫ్లైట్ టేకాఫ్ ని అడ్డుకున్న చిన్న ఎలుక

ఇక,దేశ సమగ్రత, ఐక్యతల విషయంలో ఎటువంటి రాజీ ఉండరాదని ప్రధాని మోదీ మరోసారి సృష్టం చేశారు. విధుల్లో భాగంగా తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయానికీ నేషన్‌ ఫస్ట్‌–ఇండియా ఫస్ట్‌ అనే వైఖరినే అనుసరించాలని సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రజానుకూల విధానాలకే తప్ప, రాజకీయాలకు తావుండరాదన్నదే తన అభిమతమన్నారు. గురువారం 15వ సివిల్‌ సర్వీసెస్‌ డే దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. రానున్న 25 ఏళ్లను అమృత్‌ కాల్‌ గా అభివర్ణించారు. ఈ 25 ఏళ్లను యూనిట్‌గా తీసుకుని, ఒక విజన్‌ తో ముందుకు సాగాలి.. దేశంలోని ప్రతి జిల్లా ఇదే ఆశయంతో ఉండాలని ఆకాంక్షించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అనుసరిస్తూ మూడు లక్ష్యాలకు మనం కట్టుబడి ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. మొదటిది.. సామాన్య పౌరుడి జీవితాల్లో మార్పు తేవాలి. వారి జీవనం సులభతరం కావాలి. అదే సౌలభ్యాన్ని వారు అనుభవించాలి. రోజువారీ జీవితంలో ప్రభుత్వ సేవలను ఎటువంటి అడ్డంకులు లేకుండా వారు పొందగలగాలి. ఇదే మనందరి లక్ష్యం. దీనిని సాకారం చేయాలి. రెండవది..పెరుగుతున్న మన దేశం స్థాయిని దృష్టిలో ఉంచుకోవాలి. అదే స్థాయిలో మనం కార్యక్రమాలు చేపట్టాలి మూడవది.. ఈ వ్యవస్థలో మనం ఎక్కడున్నా దేశ సమైక్యత, సమగ్రతలే మన ప్రధాన బాధ్యతగా ఉండాలి. ఇందులో ఎలాంటి రాజీ ఉండరాదు. స్థానిక నిర్ణయాలకు సైతం ఇదే ప్రామాణికం కావాలి అని మోదీ సూచించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: India, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు