హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi Assets: ప్రధాని మోదీ ఆస్తులు ఇవే.. ఆయన వద్ద ఎంత బంగారం, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయో తెలుసా..?

PM Modi Assets: ప్రధాని మోదీ ఆస్తులు ఇవే.. ఆయన వద్ద ఎంత బంగారం, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయో తెలుసా..?

ఫ్రధాని నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

ఫ్రధాని నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంత ఆస్తులు(PM Modi assets) కలిగి ఉన్నారనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అయితే ప్రతి ఏడాది ఆయన తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంత ఆస్తులు(PM Modi assets) కలిగి ఉన్నారనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అయితే ప్రతి ఏడాది ఆయన తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాదితో పోల్చితే ప్రధాని మోదీ ఆస్తుల విలువ.. స్వల్పంగా పెరిగింది. మోదీ తాజా డిక్లరేషన్ ప్రకారం.. ఆస్తుల విలువ రూ. 22 లక్షలు పెరిగిందని అధికారిక డేటాను ఉటంకిస్తూ Hindustan Times కథనాన్ని ప్రచురించింది. ఇక, తాజా డిక్లరేషన్ ప్రకారం మోదీకి రూన. 3.07 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయితే గతేడాది ఆయన ఆస్తులు విలువ రూ. 2.85 కోట్లుగా ఉంది.

పలువురు కేంద్ర మంత్రుల మాదిరిగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (PM Narendra Modi) కూడా స్టాక్‌ మార్కెట్‌లో ఎలాంటి పెట్టుబడులు లేవు. ఆయనకు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(రూ. 8.6 లక్షలు), లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలు(రూ. 1.5 లక్షలు), ఎల్ అండ్ టీ ఇన్‌ఫ్రాస్రక్చర్ (L&T infrastructure) బాండ్స్‌లో(ఇవి మోదీ 2012లో రూ. 20వేలకు కొనుగోలు చేశారు) పెట్టుబడులు ఉన్నాయి. మోదీకి సొంత వాహనం కూడా లేదు. ఇక ఆభరణాల విషాయనికొస్తే...ప్రధాని మోదీకు రూ. 1.48 లక్షలు విలువచేసే 4 బంగారు ఉంగరాలున్నాయి. బ్యాంకు బ్యాలెన్స్ రూ. 1.5 లక్షలు, ఆయన వద్ద రూ. 36,000 నగదు ఉన్నాయి.

Uttar Pradesh: యూపీలో బీజేపీ దూకుడు.. నిషాద్ పార్టీ​తో కమలం పొత్తు.. వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికలు


ఇక, మోదీ ఆస్తుల పెరుగుదలకు ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) గుజరాత్‌ గాంధీనగర్‌ బ్రాంచ్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్ కారణమని ఆయన డిక్లరేషన్ ద్వారా తెలుస్తోంది. గతేడాది ఫిక్స్‌డ్ డిపాజిట్ విలువ గతేడాది రూ. 1.6 కోట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి 31కి ఆ విలువ రూ. 1.8 కోట్లకు చేరింది.

2014‌లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేయలేదు. ఆయనకు 2002లో కొనుగోలు చేసిన రెసిడెన్షియల్ ప్రాపర్టీ విలువ రూ. 1.1 కోట్లుగా ఉంది. అయితే అది ఉమ్మడి ఆస్తి. అందులో ప్రధాని మోదీతో మరో ముగ్గురికి సమాన హక్కు ఉంది. మొత్తం 14,125 చదరపు అడుగుల విస్తీర్ణంలో.. మోదీ వాటా 3,531 చదరపు అడుగులు. ఇక, ప్రతి ఏడాది స్వయంగా ఆస్తుల వివరాలు వెల్లడిస్తూ మోదీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధానిగా అందే వేతనమే మోదీకి ప్రధాన ఆదాయ వనరుగా తెలుస్తోంది.

Modi in US: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో మోదీ ఏం చర్చించారు? మీటింగ్ విశేషాలు ఇవే!


ఇక, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ( Atal Bihari Vajpayee) హయాంలో.. ప్రజా జీవితంలో మరింత పారదర్శకత కోసం.. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో కేంద్ర మంత్రులందరూ తమ ఆస్తులు మరియు అప్పులను స్వచ్ఛందంగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. డిక్లరేషన్‌లు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచేలా నిర్ణయం తీసుకుంది.

First published:

Tags: Assets, PM Narendra Modi

ఉత్తమ కథలు