Ayodhya Verdict: సంయమనం పాటించండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

అయోధ్యపై ఎలాంటి తీర్పు వచ్చినా.. అది ఒకరి విజయంగానో, మరొకరి ఓటమిగానో పరిగణించకూడదని సూచించారు మోదీ. కోర్టు తీర్పు తర్వాత కూడా మనమంతా కలిసి శాంతి సామరస్యాలను కాపాడుకోవాలన్నారు ప్రధాని.

news18-telugu
Updated: November 9, 2019, 6:55 AM IST
Ayodhya Verdict: సంయమనం పాటించండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
ప్రధాని మోదీ (ఫైల్)
news18-telugu
Updated: November 9, 2019, 6:55 AM IST
Ayodhya Verdict: శనివారం అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై తుది తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా సంయమనం పాటించి.. శాంతిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.  అయోధ్యపై ఎలాంటి తీర్పు వచ్చినా.. అది ఒకరి విజయంగానో, మరొకరి ఓటమిగానో పరిగణించకూడదని సూచించారు మోదీ. కోర్టు తీర్పు తర్వాత కూడా మనమంతా కలిసి శాంతి సామరస్యాలను కాపాడుకోవాలన్నారు ప్రధాని.

అయోధ్యపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం వచ్చినా అది ఎవరి విజయం లేదా ఓటమి కాదు. ఈ నిర్ణయం భారతదేశం యొక్క శాంతి, ఐక్యత, సద్భావన యొక్క గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలని దేశవాసులకు నా విజ్ఞప్తి.
ప్రధాని మోదీ







అయోధ్య భూవివాదం కేసులో సీజేఐ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం శనివారం తుది తీర్పు వెలువరించనుంది.
First published: November 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...