హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Depositors First: బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ రూ.5లక్షలకు పెంపు -PM Modi కీలక ప్రకటన

Depositors First: బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ రూ.5లక్షలకు పెంపు -PM Modi కీలక ప్రకటన

డిపాజిటర్స్ ఫస్ట్ కార్యక్రమంలో లబ్దిదారులకు చెక్కులిస్తోన్న ప్రధాని మోదీ

డిపాజిటర్స్ ఫస్ట్ కార్యక్రమంలో లబ్దిదారులకు చెక్కులిస్తోన్న ప్రధాని మోదీ

బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవర్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇప్పటివరకు రూ.1 లక్ష ఇన్సూరెన్స్ ఉన్న పరిధిని పెంచి రూ.5 లక్షలకు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కేంద్ర రాష్ట్రాల సహకార బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్‌డ్, కరంట్, రికరింగ్ డిపాజిట్లకు ఈ ఇన్సురెన్స్ పథకం వర్తించనుంది.

ఇంకా చదవండి ...

బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కేంద్రంలోని మోదీ సర్కార్ కీలక సంస్కరణలు చేపట్టింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు కీలక ప్రకటన చేశారు. బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవర్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇప్పటివరకు రూ.1 లక్ష ఇన్సూరెన్స్ ఉన్న పరిధిని పెంచి రూ.5 లక్షలకు చేసిందని ప్రధాని వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కేంద్ర రాష్ట్రాల సహకార బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్‌డ్, కరంట్, రికరింగ్ డిపాజిట్లకు ఈ ఇన్సురెన్స్ పథకం వర్తించనుంది. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన డిపాజిటర్స్ ఫస్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ విషయం తెలిపారు. ఇదే వేదికపై మంత్రి పియూష్ గోయల్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సైతం కీలక అంశాలను ప్రస్తావించారు. వివరాలివి..

బ్యాంకు డిపాజిట్ బీమా కవరేజీని పెంచాలని తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరేవాడినని, కానీ ఫలితం లేకపోయిందని, ఆ పని చేయడం కోసమే తనను ప్రజలు ప్రధాన మంత్రిని చేశారని నరేంద్ర మోదీ అన్నారు. బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజీ రూ.1లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచామని, దీని వల్ల ఒకవేళ బ్యాంకులు దివాలా తీసినా లేదా నష్టాల్లో నడుస్తున్నా డిపాజిటర్ల సొమ్ములో రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ భద్రత ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ‘డిపాజిటర్స్ ఫస్ట్: రూ.5 లక్షల వరకు నిర్ణీత కాల వ్యవధిలో డిపాజిట్ బీమా చెల్లింపు హామీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Hyderabad : సెలైన్‌తో విషం ఎక్కించుకుని.. యువ డాక్టర్ ఎందుకిలా చేశాడు?



డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారింటీ కార్పొరేషన్(DICGC) యాక్ట్ ప్రకారం దివాలా లేదా నష్టాల్లో ఉన్న బ్యాంకుల డిపాజిటర్లు తమ డబ్బుని విత్‌డ్రా చేసుకునేందుకు అప్లై చేసుకున్న 90 రోజుల్లో తిరిగి ఇచ్చేసే వీలుంటుందన్న ప్రధాని.. ఇప్పటికే రూ.1300 కోట్లు డిపాజిటర్లకు చేరాయని గుర్తుచేశారు. గత పాలకులు సమస్యలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తే, బీజేపీ సర్కారు మాత్రం వాటికి శాశ్వత మార్గాలు కనిపెట్టిందని, నేటి నవ భారతం సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించిందని అన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ప్రధాని మోదీ చెక్కులు అందజేశారు.

Sweden girl: ముంబై స్లమ్ డాగ్ ప్రియుడి కోసం స్విడన్ బాలిక ఏం చేసిందో తెలిస్తే అవాక్కవుతారు..



డిపాజిటర్స్ ఫస్ట్ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా దాదాపు 98 శాతం డిపాజిట్ ఖాతాలు లబ్ధి పొందుతాయన్నారు. దీనివల్ల బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. బీమా కవరేజిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచామని, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ క్రింద సమయాన్ని 8-9 సంవత్సరాల నుంచి 90 రోజులకు తగ్గించామని తెలిపారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశం యావత్తు కలిసికట్టుగా పని చేయగలమని నిరూపించిందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థూల చోదక శక్తిగా వాస్తవంగా మారగలిగే సమయం భారత దేశానికి వచ్చిందన్నారు.

First published:

Tags: Banking, Banks, Insurence, Pm modi

ఉత్తమ కథలు