Home /News /national /

PM MODI AND MANMOHAN SINGH AND OTHERS CAST THEIR VOTE FOR VICE PRESIDENTIAL POLLS PVN

Vice presidential elections : ఓటు వేసిన మోదీ..మళ్లీ వీల్ చైర్ లోనే మన్మోహన్



ఓటు వేస్తోన్న మోదీ(Image Source:Twitter)

ఓటు వేస్తోన్న మోదీ(Image Source:Twitter)

Vice President Elections : ఉప రాష్ట్రపతి ఎన్నికల (Vice presidential elections)పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Vice President Elections : ఉప రాష్ట్రపతి ఎన్నికల (Vice presidential elections)పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్ల‌మెంట్‌లో ఏర్పాటు చేసిన బూత్‌లో ఆయ‌న ఓటేశారు. ఎంపీలు,కేంద్రమంత్రులు కూడా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ ఎంపీ మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు ఆయన వీల్​ఛైర్​లో పార్లమెంట్​కు వచ్చారు. ఆయనకు సిబ్బంది సహకరించారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఆయన వీల్​ఛైర్​లోనే వచ్చి ఓటేయడం గమనార్హం. కాగా,ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నెం.63లో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగుతోంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌ మొదలుపెట్టి రాత్రికల్లా ఫలితం వెల్లడిస్తారు. లోక్​సభ సెక్రెటరీ జనరల్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ సాగుతుంది.

లోక్‌సభకు చెందిన 543, రాజ్యసభకు చెందిన 245 మంది ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో జమ్మూకశ్మీర్‌ నుంచి 4, త్రిపుర నుంచి 1, నామినేటెడ్‌ సభ్యులనుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే 780 మందికి ఓటు వేసే హక్కు ఉంది. ఇందులో లోక్‌సభలో 23, రాజ్యసభలో 13 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌..మార్గరెట్ అల్వాను ఎంపిక చేసేటపుడు తమను సంప్రదించలేదన్న కారణంతో ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినందున ఆ పార్టీకి చెందిన 36 మంది సభ్యులు మినహాయించి మిగిలిన 744 మంది ఓటింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంది.

New creature : సముద్రంలో కొత్త జీవి..ఆశ్చర్యపోతున్న జనం!

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేసే విధానాన్ని వివరిస్తూ బీజేపీ శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించింది. ఎన్డీయే కూటమి భాగస్వామ్య పార్టీల ఎంపీలు దీనిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కొందరు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ, మరో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బీజేపీ నిర్వహించిన మాక్ ఓటింగ్ డ్రిల్ అనంతరం ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్ పార్లమెంటుకు వచ్చారు. తనకు మద్దతిస్తున్నందుకు ఎన్డీయే ఎంపీలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉభయసభల్లో ఎన్డీయే, దాని మిత్రపక్షాలకు స్పష్టమైన బలమున్నందున అధికారిక కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్(Jagdeep Dhankar)గెలుపు లాంఛనమే కానుంది. కొత్త ఉపరాష్ట్రపతి ఈనెల 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు.



పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఎన్డీయే అభ్యర్థిగానూ, కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వా ప్రతిపక్షాల అభ్యర్థిగానూ పోటీ చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎన్డీయే అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్గరెట్ అల్వా (Margaret Alva) కాంగ్రెస్ సీనియర్ నేత, గతంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జగదీప్ ధన్‌కర్ జాట్ నేత, సోషలిస్టు భావజాలం కలిగిన వ్యక్తి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Manmohan singh, Pm modi, Vice President Elections 2022

తదుపరి వార్తలు