వచ్చే దశాబ్దం సైన్స్ అండ్ టెక్నాలజీదే... బెంగళూరులో ప్రధాని మోదీ సందేశం

PM Modi : వచ్చే దశాబ్దంలో భారత్ సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోయేలా చేస్తామన్న మోదీ... దీని ప్రయోజనాలు గ్రామాల్లో ప్రజలకు చేరేలా చేస్తామన్నారు.

news18-telugu
Updated: January 3, 2020, 12:13 PM IST
వచ్చే దశాబ్దం సైన్స్ అండ్ టెక్నాలజీదే... బెంగళూరులో ప్రధాని మోదీ సందేశం
వచ్చే దశాబ్దం సైన్స్ అండ్ టెక్నాలజీదే... బెంగళూరులో ప్రధాని మోదీ సందేశం
  • Share this:
బెంగళూరులో 107 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రసంగించిన ఆయన... కొత్త సంవత్సరంలో తన కొత్త కార్యక్రమం... సైన్స్ అండ్ టెక్నాలజీతో ముడిపడి ఉండటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. స్టార్టప్‌ల కేంద్రం బెంగళూరు అన్న ఆయన... ప్రతీ ఒక్కరి స్వప్నమూ బెంగళూరులో నెరవేరుతోందన్నారు. సైన్స్ సమీక్షల్లో భారత్ మూడోస్థానానికి చేరిందన్న మోదీ... ఇన్నోవేటివ్ ఇండెక్స్‌లో భారత్ 52వ స్థానానికి వచ్చిందన్నారు. వేగవంతమైన అభివృద్ధికి నవకల్పన, వస్తు ఉత్పత్తి, ప్రజల సహకారం ఉండాలన్న మోదీ... ప్రజల మద్దతుతోనే సరికొత్త ఇండియా రూపకల్పన జరుగుతోందన్నారు. ఇందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ఎంతో ఉందన్నారు. గ్రామాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు... స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్ ద్వారా కృషి చేస్తున్నామన్న మోదీ... టెక్నాలజీ, మంచి పాలన అందిస్తున్నామన్నారు. దేశంలో 6 కోట్ల మంది రైతులకు... పీఎం సమ్మాన్ నిధి ద్వారా... రైతులకు నిధులు ఇస్తున్నామన్న మోదీ... ఆధార్ సహిత టెక్నాలజీ ద్వారానే ఇది సాధ్యమవుతోందన్నారు.


జియో ట్యాగింగ్, డేటా సైన్స్, రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు అన్నీ టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతున్నాయన్న మోదీ... తమ ప్రయత్నాలు మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రతీ అంశంలో సైన్స్ వాడకాన్ని పెంచుతామన్నారు. డిజిటల్ టెక్నాలజీ, ఈకామర్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటివి గ్రామాలకు చేరువయ్యాయన్న మోదీ... రైతులు వాతావరణ వివరాల్ని తమ మొబైల్స్ ద్వారా తెలుసుకుంటున్నారని వివరించారు. వచ్చే దశాబ్దంలో భారత్ సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోయేలా చేస్తామన్న మోదీ... దీని ప్రయోజనాలు గ్రామాల్లో ప్రజలకు చేరేలా చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ ఇలాంటిదే అన్న మోదీ... దీనివల్ల నీటిని రీసైక్లింగ్ చేసి, మళ్లీ వాడుకునేందుకు వీలవుతోందన్నారు. వాటర్ గవర్నెన్స్ అనేది ముఖ్యమైన అంశమన్న మోదీ... నీటిని సమర్థంగా వినియోగించుకోవడానికి అందరం సన్నద్ధం కావాలన్నారు. నీటి వాడకాన్ని తగ్గించాలన్నారు. దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించుకోవాలన్న మోదీ... అలా చేస్తే,... పక్షులు, జంతువులు, చేపలు, భూమి, పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ స్థానంలో మట్టి పాత్రలు, నార సంచులు, ఫైబర్ వంటివి వాడాలన్నారు.



కర్ణాటకలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని మోదీ... DRDOలో ఐదు యంగ్ సైంటిస్ట్స్ ల్యాబొరేటరీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన... కర్ణాటక సీఎం యడ్యూరప్ప, గవర్నర్ వాజూభాయ్ వాలా‌ను కలుసుకున్నారు.
First published: January 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు