PM-Kisan Scheme: రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు

PM-Kisan Scheme | ఫిబ్రవరి 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనప్పటి నుంచి మొదటి విడత డబ్బులు రైతుల అకౌంట్‌లో జమ అవుతున్నాయి. ఏప్రిల్ 1న రెండో విడత మొదలవుతుంది.

news18-telugu
Updated: March 31, 2019, 2:54 PM IST
PM-Kisan Scheme: రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు
PM-Kisan Scheme: రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు
news18-telugu
Updated: March 31, 2019, 2:54 PM IST
ఎన్నికల నియమావళి అమలులోకి రావడానికి ముందు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకంలో రిజిస్టర్ చేసుకున్న 4.74 కోట్ల మంది రైతులకు ఏప్రిల్ 1 నుంచి రెండో విడత డబ్బులు అకౌంట్‌లో జమ కానున్నాయి. రెండో విడతలో భాగంగా ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.2,000 జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ 4.74 కోట్ల మంది రైతుల్లో ఇప్పటికే 2.74 కోట్ల మందికి మొదటి వాయిదా డబ్బులు వచ్చేశాయి. మిగతావారికీ త్వరలో అకౌంట్‌లో డబ్బులు జమ కానున్నాయి. PM-Kisan పథకంలో మార్చి 10 లోపు రైతులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి మొదటి, రెండో వాయిదాలు చెల్లించేందుకు ఎన్నికల కమిషన్ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాకకు అనుమతి ఇచ్చింది.

Read this: March 31 Deadline: మార్చి 31 లోగా పూర్తిచేయాల్సిన 10 ముఖ్యమైన పనులివే...

లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.75,000 కేటాయించింది. ఐదు ఎకరాల లోపు పొలం ఉన్న 12 కోట్ల మంది రైతులకు ప్రతీ ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం ఉద్దేశం. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తామని ముందే ప్రకటించింది కేంద్రం. ఫిబ్రవరి 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనప్పటి నుంచి మొదటి విడత డబ్బులు రైతుల అకౌంట్‌లో జమ అవుతున్నాయి. ఏప్రిల్ 1న రెండో విడత మొదలవుతుంది.

Read this: Election 2019: ఓటర్ ఐడీ కార్డ్ పోయిందా? డూప్లికేట్ కార్డ్ ఇలా పొందొచ్చు



మొదటి విడతలో పీఎం కిసాన్ పథకంలో లబ్ధిదారుల్ని గుర్తించడం, డబ్బులు జమ చేయడంలో కొన్ని లోపాలు బయటపడ్డాయి. మొదటి విడతకు సంబంధించి ఏకంగా 4 లక్షల ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ కావడం కొద్దిరోజుల క్రితం కలకలం రేపింది. రైతులకు డబ్బులు జమ కాకపోవడం, ఒకే రైతుకు రెండుసార్లు అకౌంట్‌లో డబ్బులు వేయడం, రైతులు కానివారి అకౌంట్‌లో డబ్బులు జమ కావడం లాంటి సమస్యలు తలెత్తాయి. అయితే రెండో విడతలో ఈ సాంకేతిక సమస్యల్ని అధిగమిస్తామని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. మొదటి రెండు విడతలకు ఆధార్ అవసరం లేదని తేల్చిచెప్పిన కేంద్రం... మూడో విడత నుంచి ఆధార్ తప్పనిసరి చేయనుంది.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

Video: బయట నిమ్మరసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త... ఓ రైల్వేస్టేషన్‌లో సీన్ చూడండి

ONGC Jobs: ఓఎన్జీసీలో 785 ఖాళీలు... వివరాలివే

MIDHANI Notification: బీటెక్ లేదా డిప్లొమా చేశారా? మిధానిలో అప్రెంటీస్‌కు అవకాశం
First published: March 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...