హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Kisan Scheme: ఖాతాల్లోకి రూ.2,000లు పీఎం కిసాన్ డ‌బ్బులు.. ఎకౌంట్లో ప‌డేదీ ఆ రోజే!

PM Kisan Scheme: ఖాతాల్లోకి రూ.2,000లు పీఎం కిసాన్ డ‌బ్బులు.. ఎకౌంట్లో ప‌డేదీ ఆ రోజే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PM Kisan Scheme Money | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 10వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను త్వరలో రిలీజ్ చేయనుంది. రైతుల ఖాతాల్లోకి రూ.2,000 చొప్పున నిధుల్ని జమ చేయనుంది మోదీ ప్రభుత్వం. ఈ ఏడాది ప‌దో విడ‌త డ‌బ్బుల‌ను విడుద‌ల తేదీని పీఎంఓ ప్ర‌క‌టించింది.

ఇంకా చదవండి ...

  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 10వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను త్వరలో రిలీజ్ చేయనుంది. రైతుల ఖాతాల్లోకి రూ.2,000 చొప్పున నిధుల్ని జమ చేయనుంది మోదీ ప్రభుత్వం (Modi Government). ఈ ఏడాది ప‌దో విడ‌త డ‌బ్బుల‌ను విడుద‌ల చేయ‌నుంది.  ఈ డ‌బ్బుల‌ను ప్ర‌ధాని మోదీ నవరి 1న మధ్యా హ్నం 12.30 గం టలకు వీడియో కాన్ఫ రెన్స్ ద్వా రా విడుదల చేస్తారని పీఎం ఓ అధికారికంగా తెలిపింది. ఈ పథకం ద్వా రా దేశవ్యా ప్తం గా దాదాపు 10కోట్ల రైతు కుటుం బాల ఖాతాల్లో రూ.20వేల కోట్లకు పైగా సొమ్ము ను జమ చేయనున్న ట్టు పేర్కొం ది. దేశం లో అర్హులైన రైతు కుటుం బాల ఖాతాల్లో కేంద్రం ఏటా రూ.6వేలు చొప్పు న జమ చేస్తున్న విషయం తెలిసిం దే. ఏడాదిలో మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఈ మొత్తాలను జమ చేస్తున్నా రు. ఈ పథకం కిం ద ఇప్ప టివరకు రూ.1.6లక్షల కోట్లను రైతుల ఖాతాల్లోకి నేరుగా జమచేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

  డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి..

  - రైతులు ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ కార్డును లింక్ చేశారో ఆ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి.

  Corona Third Wave: ఇండియాలో క‌రోనా మూడో వేవ్‌.. నిపుణులు, స‌ర్వేలు ఏం చెబుతున్నాయి!


  - అక్కడ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీపై సంతకం చేసి బ్యాంకు సిబ్బందికి ఇవ్వాలి.

  - ఒరిజినల్ ఆధార్ కార్డుపై సంతకం చేయకూడదు. ఆధార్ జిరాక్స్ కాపీ ఇస్తే చాలు.

  - మీ ఆధార్ వివరాలు వెరిఫై చేసిన తర్వాత ఆన్‌లైన్ సీడింగ్ చేస్తారు.

  - వెరిఫికేషన్ పూర్తైన తర్వాత మీకు ఎస్ఎంఎస్ లభిస్తుంది.

  APPSC Preparation: ఏపీపీఎస్‌సీలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ప‌రీక్ష విధానం, ప్రిప‌రేష‌న్ ప్లాన్‌!


  రైతులు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Farmers Corner సెక్షన్‌లో Edit Aadhaar Failure Records పైన క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫార్మర్ నేమ్‌లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత రైతు పేరు, తండ్రి పేరు, జెండర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, సబ్ డిస్ట్రిక్ట్ పేరు, బ్లాక్ పేరు, ఊరి పేరు లాంటివన్నీ సరిచూసుకోవాలి. అన్నీ కరెక్ట్‌గా ఉంటే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి. వివరాల్లో తప్పులు ఉంటే Edit పైన క్లిక్ చేసి సరిచేసుకోవచ్చు.

  First published:

  Tags: PM KISAN, Pm modi, PM Narendra Modi

  ఉత్తమ కథలు