రైతుల ఖాతాల్లో కేంద్రం క్యాష్ వేసే తేదీ ఖరారు

PM-KISAN: 2019 మే రెండో వారానికి ఎన్నికలు పూర్తికావాలి. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు కనీసం రెండు నెలల సమయం పడుతుంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ రెండు పథకాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

news18-telugu
Updated: February 12, 2019, 1:44 PM IST
రైతుల ఖాతాల్లో కేంద్రం క్యాష్ వేసే తేదీ ఖరారు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 1:44 PM IST
కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన హామీలను అమలు చేసే దిశగా మోదీ సర్కారు అడుగులు వేస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల షెడ్యూల్ రాకముందే బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలను మొదటిదఫా అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో రైతుల కోసం ప్రకటించిన కిసాన్ సమ్మాన్ పథకాన్ని మొదటగా ప్రారంభించనుంది. ఫిబ్రవరి 25వ తేదీ ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు సీఎన్‌బీసీ ఆవాజ్ ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఇచ్చింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 25వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వెళ్లనున్నారు. అక్కడ రైతులతో భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తారు. ఆ సభలోనే ప్రధాని మోదీ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తారు. మోదీ లాంఛనంగా ప్రారంభించిన తర్వాత లబ్ధిదారుల అకౌంట్లలో రూ.2000 నగదు జమ అవుతుంది. రూ.2000 చొప్పున మూడు విడుతల్లో మొత్తం రూ.6000 నగదును జమ చేయనుంది. 2018 డిసెంబర్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు.

pradhan mantri kisan samman nidhi yojana, pradhan mantri kisan yojana, pradhan mantri kisan samman yojana, pradhan mantri kisan samman nidhi scheme, pradhan mantri kisan samman nidhi yojna, pm kisan samman nidhi, pm kisan scheme, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ స్కీమ్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం రైతు బంధు, రైతు బంధు పథకం
ప్రధాన మంత్రి కిసాన్ పథకానికి ఆధార్ తప్పనిసరి... మొదటిసారి మినహాయింపు


మరోవైపు అసంఘటిత కార్మికుల కోసం మధ్యంతర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త స్కీమ్‌ను మార్చి మొదటి వారం తర్వాత ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించి కేంద్రం జారీ చేసిన నోటీఫికేషన్ ప్రకారం 2019 ఫిబ్రవరి 15 పథకం అమల్లోకి వస్తుంది. 18 ఏళ్లు నుంచి 40 ఏళ్ల వయసులోపు ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులు. నెలకు రూ.55 నుంచి అత్యధికంగా రూ.200 వరకు ఈ స్కీమ్‌లో జమచేయవచ్చు. కేంద్రం కూడా అంతే మొత్తం జమ చేస్తుంది. 60 ఏళ్ల వయసు నిండిన తర్వాత నుంచి నెలకు రూ.3000 పెన్షన్ వస్తుంది.Modi AP Tour, Chandrababu Naidu,PM Modi,Lok Sabha polls,Lok Sabha elections 2019, NT Rama Rao, PM Modi Guntur, Modi guntur meeting, Modi meeting, Narendra Modi news, Chandrababu Naidu, Chandrababu Naidu counter Modi, Modi Go Back, Modi Go Back to Gujarat, Modi is a mistake, నారా చంద్రబాబునాయుడు, మోదీపై చంద్రబాబునాయుడు, విజయవాడ సభలో చంద్రబాబునాయుడు, నరేంద్ర మోదీకి చంద్రబాబు కౌంటర్, మోదీ గో బ్యాక్, మోదీ గో బ్యాక్ గుజరాత్, మోదీ ఈజ్ ఏ మిస్టేక్, లోక్‌సభ ఎన్నికలు 2019, నరేంద్ర మోదీ గుంటూరు, మోదీ గుంటూరు సభ, మోదీ మీటింగ్, నరేంద్ర మోదీ న్యూస్
గుంటూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ (ANI)


2019 ఏప్రిల్, మే రెండో వారానికి ఎన్నికలు పూర్తికావాలి. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు కనీసం రెండు నెలల సమయం పడుతుంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ రెండు పథకాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...