GatiShakti : ఇండియాలో జాతీయ రహదారుల అభివృద్ధికి అలాగే వాటి విధివిధానాల గురించి ఎప్పటికప్పుడు నూతన ప్రతిపాదనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే విధంగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(MORTH), పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద జాతీయ రహదారులకు సంబంధించి నూతన ఆపరేటింగ్ విధానాన్ని అలాగే ప్రతిపాదనల పద్దతులను ప్రకటించింది. ఇకపై మల్టీ మోడల్ కనెక్టివిటీకి నిర్ణీత ప్రాజెక్టు ఎలా దోహదపడుతుందో, అలాగే తయారీ, వాణిజ్య విభాగాలను మౌలిక సదుపాయాల విభాగానికి ఎలా కలుపుతుందో రహదారుల మంత్రిత్వ శాఖ ముందే వివరించాల్సి ఉంటుంది. ఈ మేరకు గతిశక్తి ప్లాన్ కింద అమలయ్యే నేషనల్ హేవేస్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP)ను మంత్రిత్వ శాఖ సవరించింది.
పూర్తి వివరాలు చెప్పాల్సిందే..
న్యూ టెక్నాలజీ ఫర్ హైవే డెవలప్మెంట్ డైరెక్టర్ బిదుర్ కాంత్ జా సైన్ చేసిన మెమోరాండంలో నేషనల్ హైవే ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని నిర్దిష్ట వివరాలను చెప్పాలని పేర్కొంది. వాణిజ్య విభాగాల నుంచి ఉత్పత్తి అయ్యే వస్తువుల వివరాలు, ఈ ప్రాజెక్ట్‌లో ఉపయోగించాల్సిన నేషనల్ హైవే కారిడర్లు అలాగే వాటికి గమ్య స్థానాలు, ఈ ప్రాజెక్టు వల్ల తగ్గే రవాణా ఖర్చుపై పూర్తి వివరాలు, ఈ ప్రాజెక్టు వల్ల తగ్గుతున్న ట్రాఫిక్ అంచనాలు, సమాంతరంగా ఉండే ట్రాఫిక్ విధానం నేషనల్ హైవేస్ పై దాని ప్రభావం గురించి, అలాగే ఈ ప్రాజెక్ట్ కారిడార్‌పై నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్‌తోను పక్కనే ఉన్న ఇతర నేషనల్ హైవే కారిడార్స్‌తోను చర్చించవలసి ఉంది అని తెలిపింది.
ఇకనుంచి ఈ ప్రాజెక్టు కోసం నేషనల్ హైవేస్ చేసే ప్రతిపాదనలను ప్రాజెక్ట్ రిపోర్ట్ లో నమోదు చేయాలని ఆర్డర్ ఇచ్చింది. ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరికీ, అలాగే నేషనల్ హైవేలు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించే ప్రాజెక్టులు డీల్ చేసే పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీల చీఫ్ ఇంజనీర్లకు ఈ ఆర్డర్స్ అందించింది.
పీఎం గతిశక్తి ప్లాన్ గురించి..
PM గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అనేది అన్ని వాణిజ్య విభాగాలకు మల్టీ మోడల్ కనెక్టివిటీ అందించడానికి ఉద్దేశించినది. 2021, అక్టోబర్ 21న కేంద్ర క్యాబినెట్ ఈ విధానాన్ని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 5 ట్రిలియన్ డాలర్లు వాణిజ్య ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మాస్టర్ ప్లాన్ కింద రోడ్ల నుండి రైల్వే వరకు, విమానయానం నుండి వ్యవసాయం వరకు, వివిధ మంత్రిత్వ శాఖలు వాటి విభాగాలు అన్నీ అనుసంధానమవుతాయి.
2024-2025 సంవత్సరానికల్లా భారతమాత ప్రాజెక్టు కింద రోడ్డు రవాణ, హైవే విభాగానికి సంబంధించి రెండు లక్షలు కిలోమీటర్ల నేషనల్ హైవే నెట్వర్క్ రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తీర ప్రాంతాల్లో 5,590 కిలోమీటర్ల నాలుగు లైన్లు, ఆరు లైన్ల నేషనల్ హైవేలను 2024-2025 సంవత్సరానికి పూర్తి చేయనుంది. ఈశాన్య భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులను నాలుగు లైన్ల జాతీయ రహదారికి గాని, రెండు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో జరిగే రెండు లైన్లు రహదారులుకు కలిసే విధంగా రోడ్ల ఏర్పాటును 2024-2025 సంవత్సరంలోపు చేయనున్నారు.
Cervavac: 2023నుంచి స్కూళ్లలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్..9-14ఏళ్ల విద్యార్థినులకు ఉచితంగా పంపిణి
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి శాఖకు కచ్చితమైన సమాచారం అందించేలా టెక్నాలజీని రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వివిధ వాటాదారులను ఒక చోట చేర్చి వివిధ రకాల రవాణా మార్గాలను ఏకీకృతం చేయడంలో సహాయం పడటానికి ప్రణాళిక సిద్ధం చేశారు. వివిధ రంగాల నిర్దిష్ట అభివృద్ధి కోసం 16 మంత్రిత్వ శాఖలను ఒక జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులను పర్యవేక్షించడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. భారతదేశంలో వ్యాపార సౌరభ్యాన్ని పెంచడం కోసం వాణిజ్య విభాగాల ఏర్పాటు అనేది ఈ మాస్టర్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Highways, Ministry of road transport and highways, PM Gatishakti