హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఉచిత పథకాలతో సంక్షేమం వట్టిమాట! ఇదిగో రుజువులు..పేదలకు సబ్సిడీ కొనసాగాలంటే ఇలా..

ఉచిత పథకాలతో సంక్షేమం వట్టిమాట! ఇదిగో రుజువులు..పేదలకు సబ్సిడీ కొనసాగాలంటే ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏళ్లుగా ఉచిత పథకాలు అమలవుతున్నా ఆశించిన స్థాయిలో పేదల సంక్షేమం చోటుచేసుకోకపోవడం చర్చలో ప్రధానాంశంగా ఉంటున్నది. ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటూ, పేదలకు సబ్సిడీలు కొనసాగాలంటే ఏం చేయాలి?

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi Cantonment, India

భారత్ 75వ స్వాతంత్ర్యవేడుకలు జరుపుకొంటున్న తరుణంలో దేశంలో అమలవుతోన్న ఉచిత పథకాలపై చర్చ ఇటీవల తీవ్రతరమైంది. ఏళ్లుగా ఉచిత పథకాలు అమలవుతున్నా ఆశించిన స్థాయిలో పేదల సంక్షేమం చోటుచేసుకోకపోవడం చర్చలో ప్రధానాంశంగా ఉంటున్నది. ఉచిత పథకాలపై కేంద్రం, సుప్రీంకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యానాలు చేశాయి. ఈ నేపథ్యంలో ఉచిత పథకాల ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటూ, పేదలకు సబ్సిడీలు కొనసాగాలంటే ఏం చేయాలి? అసలు ఇన్నాళ్లూ జరిగిన లోపాలేంటి? తదితర విషయాలపై సోనాలికా గ్రూప్ వైస్ చైర్మన్, పంజాబ్ ప్లానింగ్ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ ఏఎస్ మిట్టల్ కీలక అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం, 2023నాటికి భారత్.. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించనుంది. ఇది వివిధ రంగాల్లో ఆందోళనక పరిస్థితికి దారి తీయనుంది. అతిపెద్ద సవాళ్లలో ఒకటి.. మన దేశంలో సబ్సిడీల వ్యవస్థ. బహుశా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పరిమాణంలో సబ్సిడీలు అందిస్తోన్న లేదా లబ్ధిదారుల సంఖ్య (80 కోట్లు) ఇండియాదే కావచ్చు. ప్రస్తుతం నెలకొన్న కఠిన ఆర్థిక పరిస్థితిల్లో వృద్ధిని సమతుల్యం చేస్తూ ఇంత భారీ సబ్సిడీ వ్యవస్థను కొనసాగించడం దేశానికి కష్టతరమైన పని. ఆహారం, వ్యవసాయం, నిరుపేదల కోసం ఉద్దేశించిన అనేక ఇతర రాయితీలలో అక్రమాలను అరికడితేనే విద్య, ఆరోగ్యం, ఇతర ప్రాథమిక సౌకర్యాలు బలోపేతమయ్యే ఆర్థిక పొదుపులకు దారి తీస్తుంది.

ఇండియాలో కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు వెచ్చించిన మొత్తం సబ్సిడీల పరిమాణం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.6 లక్షల కోట్లు కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 27.07 లక్షల కోట్ల పన్ను కిటీ నుంచి రూ. 8.86 లక్షల కోట్లకు వేగంగా పెరిగింది. దేశం మొత్తంలో వసూలవుతోన్న పన్నుల్లో కేవలం సబ్సిడీలపై వెచ్చించిన మొత్తమే 33శాతంగా ఉంది. అది దేశ జీడీపీ (GDP)లో 6శాతం కావడం గమనార్హం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సబ్సిడీలు దేశ జీడీపీలో 3శాతం మాత్రమే ఉండేవి. అంటే, రాయితీలు పొందుతున్న జనాభాలో 70% మందికి పైగా తలసరి సబ్సిడీలు అదే కాలంలో 15% శాతం పెరిగాయి.

గత మూడేళ్లలో కేంద్రం ఆహారంపై ఇస్తోన్న సబ్సిడీ రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.09 లక్షల కోట్లుగా ఉన్న ఆహార సబ్సిడీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.87 లక్షల కోట్లకు పెరగ్గా, ఎరువుల సబ్సిడీ రూ. 81,000 కోట్ల నుంచి 1,40,000 కోట్లకు పెరిగింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKY) సబ్సిడీ 2019-20లో రూ. 6,033 కోట్ల నుంచి 2021-22 నాటికి రూ. 8,456 కోట్లకు పెరిగింది.

ప్రధాన సమస్యలివే : సబ్సిడీలలో సంస్కరణలు, ప్రత్యక్ష లబ్ధిదారుల బదిలీ (DBT)ని ప్రోత్సహించడం ప్రభుత్వం అధిక ప్రాధాన్యతగా మారింది. DBT (డైరెక్ట్ బెనిఫిట్) వల్ల డూప్లికేషన్, మోసాన్ని తగ్గించినప్పటికీ, లబ్ధిదారులకు అవసరమైన ఉపశమనాన్ని అందించడం కొనసాగిస్తుంది. DBT ఫ్రేమ్‌వర్క్ 2013లో ప్రారంభించినప్పటి నుంచి రూ. 2.50 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పటికీ, వివిధ సందర్భాల్లో, రాయితీలు వ్యవస్థలోని లీకేజీల కారణంగా వాటి అంతిమ ప్రయోజనాన్ని చేరుకోవడంలో విఫలమవుతున్నాయి. ఇవి అనేక మధ్యవర్తిత్వ పొరలతో చిక్కుముడిలా మారాయి. గణనీయమైన నష్టానికి, వృధాకు దారితీస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఐరిష్ తదితర టెక్నాలజీలతో నడిచే ప్లాట్‌ఫారమ్‌లతో పన్ను చెల్లింపుదారుల-నిధుల సబ్సిడీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తయారు చేయాల్సిఉంది.

లీకేజీలు, అవినీతి వ్యవహారాలు సబ్సిడీల ప్రభావాన్ని తగ్గిస్తాయి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS)పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం, లీకేజీలు దాదాపు 40-50% ఉన్నాయని తేలింది. PDS (రేషన్ షాపులు) స్థానంలో ప్రత్యక్ష నగదు బదిలీల ద్వారా ఆహార సబ్సిడీని హేతుబద్ధీకరించవచ్చు.

అన్నిటికంటే ముఖ్యంగా ఉచిత పథకాలతో పేదలకు నిజమైన సంక్షేమం అందించడంలేదనే వాదన ఉంది. గడిచిన ఆరు దశాబ్దాలుగా, సబ్సిడీలు, రుణమాఫీలు.. 86.2% చిన్న, సన్నకారు రైతులను (రెండు హెక్టార్ల కంటే తక్కువ సాగు చేస్తున్న) స్థిరమైన వ్యవసాయం వైపు నడిపించలేదు. కేవలం సబ్సిడీలు అందించడం వల్ల అది నిరుపేదలను ఉద్ధరించేలా లేదు. నిజానికి, రైతు నిర్వచనమే స్పష్టంగా లేదు. ఇన్‌పుట్ ఖర్చుపై సబ్సిడీ ఇవ్వడం రైతులకు అంతిమ సహాయం అయితే, వారు ఇంకా ఎందుకు తక్కువ ఆదాయంతో బాధపడుతున్నారు? రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఆదాయలేమే కదా?

వ్యవసాయంలో ఉచిత పథకాలు లేదా రాయితీ విషాదం అనేది వ్యవసాయేతర ప్రయోజనాల కోసం రైతులకు ఉద్దేశించిన ప్రయోజనాలలో ఎక్కువ భాగంగా ఉంది. ఉదాహరణకు, పంజాబ్‌లో, ఉచిత విద్యుత్‌ను పొందుతున్న 15 లక్షల బోరు బావులపై మీటరింగ్ వ్యవస్థ లేనందున, పంజాబ్‌లో రైతుల సబ్సిడీ బిల్లు సంవత్సరానికి రూ. 7,000 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడుతోంది. నీటిపారుదల ప్రయోజనం కోసం ఖచ్చితమైన వినియోగాన్ని రూపొందించడానికి ఖచ్చితమైన గణాంకాలు లేవు. రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, NRIలు కూడా, బహుళ ఆదాయ వనరులతో, ఉచిత విద్యుత్ లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు. నిజానికి పేద, చిన్న రైతు కంటే బడా బాబులే ఎక్కువ లబ్ది పొందుతారు.

ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు మితిమీరిన వినియోగానికి దారితీస్తున్నాయి. ఉదాహరణకు పంజాబ్‌లోని 148 బ్లాకుల్లో 131 బ్లాక్‌లలో నీటిని అధికంగా వినియోగిస్తున్నారు. ఒక రైతు అదే ఉత్పత్తిని పొందడానికి 1970 కంటే 3.5 రెట్లు ఎక్కువ ఎరువులు, పురుగుమందులను ఉపయోగిస్తాడు. భారత భూభాగంలో పంజాబ్ కేవలం 1.5% మాత్రమే అయినప్పటికీ, దేశంలో ఉపయోగించే మొత్తం పురుగుమందులలో 23% వాడుతుంది, ఇది తీవ్రమైన పర్యావరణ సమస్యలు, ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది.

పరిష్కారాలివే : భూగర్భ జలాలు క్షీణించడం, ఎరువుల మితిమీరిన వినియోగాన్ని నివారించడానికి మీటరింగ్-మానిటరింగ్ వ్యవస్థలో ఉచిత విద్యుత్ మరియు సబ్సిడీ ఎరువులను మార్చాల్సిన అవసరం ఉంది. అగ్రి-బిజినెస్ కంపెనీలు దీనిని పొందుతున్నందున వ్యవసాయ క్రెడిట్ వడ్డీ రాయితీ పథకంలో లీకేజీని అరికట్టడం తప్పనిసరి.

అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, బహుళ సబ్సిడీలు పొందుతున్న వ్యక్తులను తొలగించడం, అసమర్థతలను తగ్గించడానికి ఆహారంతో సహా సబ్సిడీ చెల్లింపుల్లో ఎక్కువ భాగాన్ని నగదు బదిలీ (DBT)కి తరలించడానికి ప్రభుత్వం భారీ కసరత్తును చేపట్టాలి. సబ్సిడీల పర్యవేక్షణ వ్యవస్థకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్లాట్‌ఫారమ్ అవసరం. ఇది ESI లేదా EPF ప్రయోజనాలను అందించే ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందే ప్రస్తుత లబ్ధిదారులను సులువుగా గుర్తించి తొలగిస్తుంది. రాయితీల పరిమాణాన్ని తగ్గించి, అర్హులు మాత్రమే వాటిని పొందేలా చేయడం ద్వారా ఆరోగ్యం, విద్య మరియు ప్రాథమిక సౌకర్యాల మెరుగుదలలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మూలధనాన్ని విడుదల చేస్తుంది.

భవిష్యత్తు మార్గం : నిరుపేదలు సొంత కాళ్లపై నిలబడేంత వరకు రాయితీలు వారికి సహాయపడే తాత్కాలిక చర్యలుగానే పరిగణించాలి. మనం 75వ స్వాతంత్య్ర సంవత్సరం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్నప్పటికీ, దేశంలో ఇప్పటికీ సరిపడా ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాల అవసరం. ప్రతి బ్లాక్‌కు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం అవసరం. ఆరోగ్య బీమా పరిధికి దూరంగా ఉన్న పేదలకు ప్రభుత్వ ఉచిత ఆరోగ్య సేవలు అవసరం.

విద్య, నైపుణ్యం నిరుద్యోగం.. పేదరికాన్ని ఎదుర్కోవడానికి ప్రధాన సాధనాలు. యువత పాఠశాలల్లో నాణ్యమైన విద్య, నైపుణ్య కేంద్రాలతో సాధికారత పొందాలి కాబట్టి వారు వారి తల్లిదండ్రుల వలె సబ్సిడీల లబ్ధిదారుల జాబితాలోకి వెళ్లరు. సబ్సిడీలపై పన్నుచెల్లింపుదారుల కష్టార్జిత సొమ్మును పూడ్చడం ద్వారా ప్రభుత్వం పొదుపు చేసిన డబ్బును పేదలకు అధిక నాణ్యతతో కూడిన విద్య, ఆరోగ్య సేవలతో సాధికారత కల్పించేందుకు ఉపయోగించేందుకు పరిపుష్టిని ఇస్తుంది. అదే నిజమైన అర్థంలో ‘హర్ ఘర్ తిరంగ’అవుతుంది.

(వ్యాస రచయిత ఏఎస్ మిట్టల్ (AS MITTAL) సోనాలికా గ్రూప్ వైస్ చైర్మన్, పంజాబ్ ప్లానింగ్ బోర్డు మాజీ వైస్ చైర్మన్, అసోచామ్ నార్తర్న్ రీజియన్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్. ఈ వ్యాసంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రచురణ సంస్థ అభిప్రాయాలు కానేకావు)

Published by:Madhu Kota
First published:

Tags: Scheme

ఉత్తమ కథలు