శరద్ పవార్ హత్యకు కుట్ర...పోలీసులకు ఎన్సీపీ కార్యకర్త ఫిర్యాదు

ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను హతమార్చేందుకు కుట్రజరుగుతోందంటూ ఆ పార్టీ కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

news18-telugu
Updated: February 8, 2020, 10:10 PM IST
శరద్ పవార్ హత్యకు కుట్ర...పోలీసులకు ఎన్సీపీ కార్యకర్త ఫిర్యాదు
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
  • Share this:
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆ పార్టీ కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్సీపీ కార్యకర్త లక్ష్మీకాంత్ మోహన్‌లాల్ ఖబియా ఈ మేరకు పూణెలోని శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. ఈ కుట్రలో ప్రమేయమున్న ఇద్దరు వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. రెండు యూట్యూబ్ ఛానల్స్‌లో శరద్ పవార్‌కు వ్యతిరేకంగా చేసిన కామెంట్స్‌ సహా 19 డాక్యుమెంట్లు, స్క్రీన్ షాట్స్‌లను తన ఫిర్యాదుతో జతచేర్చారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయాలని కోరారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

శరద్ పవార్‌ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని తమకు ఫిర్యాదు అందినట్లు శివాజీనగర్ సైబర్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఇనిస్పెక్టర్ జయరాం ధృవీకరించారు. ఈ ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు ఎన్సీపీ అధికార ప్రతినిధి అంకుశ్ కకడే మీడియాకు తెలిపారు. ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నట్లుయితే వెంటనే పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని, నిజాలేంటో ప్రజలకు తెలపాలని కోరారు. శరద్ పవార్‌ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందన్న కథనాల పట్ల ఎన్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

First published: February 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు