Lockdown :15 రోజులు లాక్డౌన్ విధించండి..కేంద్రానికి లేఖ రాసిన ఇండియన్ మెడికల్ అసోసియెషన్

కేంద్రం కరోనా వ్యాప్తిపై ఇప్పటికైనా మేల్కోవాలని ఇండియన్ మెడికల్ అసోసియెషన్ సూచించింది. కరోనా వైరస్‌కు బ్రేక్ వేసేందుకు కనీసం 15 రోజుల లాక్డౌన్ విధించాలని లేఖ రాసింది.

Lockdown :కేంద్రం, కరోనా వ్యాప్తిపై ఇప్పటికైనా మేల్కోవాలని ఇండియన్ మెడికల్ అసోసియెషన్ సూచించింది. కరోనా వైరస్‌కు బ్రేక్ వేసేందుకు కనీసం 15 రోజుల లాక్డౌన్ విధించాలని లేఖ రాసింది.

  • Share this:
దేశ వ్యాప్తంగా మొత్తం 12 రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే..అయితే కరోనా విలయ తాండవంతో లక్షల మంది ప్రాణాలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మరోవైపు సరైన వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు స్వతహగా లాక్డౌన్‌ను విధించాయి. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది.

అయితే ఆయా రాష్ట్రాలు లాక్డౌన్ విధించడం వల్ల ప్రయోజనం లేదని పలు పార్టీలు , సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించాలని అప్పుడే లాక్డౌన్ విధించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.

అయితే లాక్డౌన్‌పై కేంద్రం ససేమీరా అంటుంది. ప్రజల ప్రాణాల కంటే ఆర్ధిక ప్రయోజనాలే ముఖ్యమని అభిప్రాయపడుతోంది. దీంతో లాక్డౌన్ పై ఆయా రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేసింది. దీంతో దేశంలోని 14 రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. ఇన్ని రాష్ట్రాలు లాక్డౌన్‌లోకి వెళ్లినా కేంద్రం మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు సిద్దంగా లేదు.

ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా పలు సంధర్బాల్లో ప్రజలకు సేవలు అందించే ఇండియన్ మెడికల్ అసోసియెషన్ కేంద్ర నినిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. లాక్డౌన్ విధించకపోవడం వల్ల నష్టం వాటిల్లుతుందని , ఇప్పటికైనా లాక్డౌన్ ప్రకటించాలని కేంద్రానికి సూచించింది. కరోనా కేసులు అదుపులోకి రావాలంటే లాక్డౌన్ ఒక్కటే మార్గమని కేంద్రానికి సూచించింది. లాక్డౌన్ వల్ల వైరస్‌ బ్రేకు వేయగలుతామని చెప్పింది.

మరోవైపు లాక్‌డౌన్‌తో నిరంతరం కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి కాస్త ఉపశమనం కల్గుతుందని చెప్పింది. సెకండ్‌వేవ్‌ సమయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే తమకు ఆశ్చర్యమేస్తోందని పేర్కొంది. కరోనా సంధర్బంగా అసోసియేషన్‌ నుంచి కేంద్రానికి ఇచ్చిన సలహాలు, సూచనలు పలుమార్లు బుట్టదాఖలు అయ్యాయని ఆవేదన వ్యక్తంచేసింది.

ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న వైరస్‌ను అదుపులోకి తేవాలంటే ప్రణాళికతో కూడిన లాక్‌డౌన్‌ను విధించాలని తన లేఖలో ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రాలు అమలు చేస్తున్నట్టు కనీసం పదిహేను రోజులు దేశవ్యాప్త లాక్డౌన్ విధించాలని కేంద్రాన్ని కోరింది.
Published by:yveerash yveerash
First published: