PLEASE HELP FOR MY SISTER EXAM AFTER A UP BROTHER TWEET RAILWAY RUNS DELAYED TRAIN AT FULL SPEED HSN
ఒకే ఒక్క ట్వీట్ తో రెండున్నర గంటల ఆలస్యంగా వస్తున్న రైలు కాస్తా జెట్ స్పీడ్ తో నడిచింది.. ఆ యువతి కోసమే..
ప్రతీకాత్మక చిత్రం
ఓ యువతి పరీక్ష రాయడానికి ఓ రైలును కొద్ది రోజుల పాటు ప్రత్యేకంగా రైల్వే శాఖ నడిపిన ఉదంతం గురించి మీరు చదివే ఉంటారు. తాజాగా అచ్చం అలాంటి ఘటనే మరొకటి జరిగింది. తెల్లవారుజామున రావాల్సిన రైలు కాస్తా ఆలస్యం అవుతుండటంతో, పరీక్షకు హాజరు కాలేనేమోనని భయపడిపోయిందో ఓ యువతి.
’రైలు బండి, రైలు బండి.. వేలకంటూ రాదులేండి.. దీన్ని గానీ నమ్ముకుంటే అంతేనండి‘ అంటూ తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్టుగానే రైళ్ల విషయంలో కూడా అప్పుడప్పుడు ఈ పాట అబద్ధం అవుతూనే ఉంది. గతంలో ఒకే ఒక్క యువతి పరీక్ష రాయడానికి ఓ రైలును కొద్ది రోజుల పాటు ప్రత్యేకంగా రైల్వే శాఖ నడిపిన ఉదంతం గురించి మీరు చదివే ఉంటారు. తాజాగా అచ్చం అలాంటి ఘటనే మరొకటి జరిగింది. తెల్లవారుజామున రావాల్సిన రైలు కాస్తా ఆలస్యం అవుతుండటంతో, పరీక్షకు హాజరు కాలేనేమోనని భయపడిపోయిన ఓ యువతి కష్టాన్ని రైల్వేశాఖ తీర్చింది. ఊహించని వేగంతో జెట్ స్పీడ్ తో ఆ రైలు దూసొకొచ్చింది. ఆ యువతిని గమ్యస్థానానికి అంతే వేగంతో చేర్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మౌ ప్రాంతానికి చెందిన నజియా తాబస్సమ్ అనే యువతికి వారణాలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పరీక్ష ఉంది. దీంతో చప్రా నుంచి వారణాసికి వెళ్లే రైలు(05111) లో ఆమె టికెట్ ను బుక్ చేసుకుంది. వాస్తవానికి ఆ రైలు మౌ జంక్షన్ కు ఉదయం 6.25 గంటలకు చేరుకోవాలి. కానీ ఉదయం పూట మంచు ఎక్కువగా ఉండటంతో రైలు ఆలస్యంగా నడుస్తోంది. దాని వల్ల ఉదయం 8గంటలు దాటినా ఆ రైలు అక్కడికి చేరుకోలేదు. దీంతో తాను పరీక్ష మిస్సవడం ఖాయమని భయంగా తన సోదరుడు అన్వర్ జమీల్ కు ఫోన్ చేసి చెప్పింది.
Train is delayed by 02:27 hrs. And my sister's exam will start from 12 O'clock in Varanasi.
So please help to reach.
Train No. 05111
PNR. 2215697237@RailwaySevapic.twitter.com/Ww4Mi5vuRn
ట్విటర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జమీల్, ఈ విషయాన్ని రైలు ఆలస్యంగా నడుస్తున్న విషయాన్ని చెబుతూ బుధవారం నార్త్ ఈస్ట్రన్ రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ పెట్టాడు. ఆ పరీక్ష ఆమె భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని తెలిపాడు. దీంతో స్పందించిన రైల్వే శాఖ ఆ రైలును జెట్ స్పీడుతో నడిచేలా చేసింది. రెండున్నర గంటల ఆలస్యంగా నడిచిన రైలు కాస్తా.. అమిత వేగంతో ప్రయాణించి 11గంటలకే వారణాసిలో ఉండేట్టుగా చేయగలిగారు. దీంతో రైల్వే అధికారులకు ఆ యువతి, ఆమె సోదరుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు రైల్వే అధికారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.