ఆప్ ప్రతిపాదనను అంగీకరించొద్దు...ప్రధాని మోదీకి ‘మెట్రో శ్రీధరన్’ లేఖ

మెట్రో రైళ్లలో ఓ వర్గానికి రాయితీలు కల్పిస్తే, విద్యార్థులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ఇతర వర్గాల నుంచి కూడా రాయితీలు కల్పించాలన్న డిమాండ్లు రావచ్చని మెట్రో శ్రీధరన్ చెప్పారు.

news18-telugu
Updated: June 14, 2019, 7:49 PM IST
ఆప్ ప్రతిపాదనను అంగీకరించొద్దు...ప్రధాని మోదీకి ‘మెట్రో శ్రీధరన్’ లేఖ
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 14, 2019, 7:49 PM IST
ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలన్న కేజ్రీవాల్ సర్కార్ ప్రతిపాదనను ‘మెట్రో శ్రీధరన్’ తీవ్రంగా వ్యతిరేకించారు. ఢిల్లీ మెట్రోతో పాటు దేశంలోని ఇతర మెట్రోలను ఆర్థికంగా దివాలా తీయించే అవకాశమున్నందున ఆప్ సర్కారు ప్రతిపాదనను ఆమోదించొద్దని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. ఓ వర్గానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే...విద్యార్థులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు సహా ఇతర వర్గాల నుంచి కూడా ఆ రకరమైన డిమాండ్లు రావచ్చన్నారు. దేశంలోని ఇతర మెట్రోల్లోనూ ఇదే రకమైన డిమాండ్లు రావచ్చని పేర్కొన్నారు. ఆప్ సర్కారు తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కారణంగా దేశంలోని అన్ని మెట్రోలు అసమర్థంగా తయారుకావడంతో పాటు ఆర్థికంగా దివాలా తీసే అవకాశముందని హెచ్చరించారు.

ఢిల్లీ సర్కారు మహిళలకు ఈ యితీని కల్పించాలని భావిస్తే...వారి బ్యాంకు ఖాతాలకు నగదును ట్రాన్స్‌ఫర్ చేయొచ్చని సూచించారు. ఢిల్లీ మెట్రో ప్రారంభంలోనే ఎలాంటి రాయితీలు కల్పించకూడదని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2002 డిసెంబరులో ఢిల్లీ మెట్రో మొదటి సెక్షన్‌ను ప్రారంభించేందుకు వచ్చిన సమయంలో నాటి ప్రధాని వాజ్‌పేయి స్వయంగా టిక్కెట్ కొనుక్కొని మెట్రో రైల్లో ప్రయాణించారని శ్రీధరన్ గుర్తుచేశారు.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...