హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Arunachal Teen : సేఫ్ గా ఇంటికి..అరుణాచల్ యువకుడిని ఆర్మీకి అప్పగించిన చైనా

Arunachal Teen : సేఫ్ గా ఇంటికి..అరుణాచల్ యువకుడిని ఆర్మీకి అప్పగించిన చైనా

అరుణాచల్ యువకుడిని భారత్ కు అప్పగించిన పీఎల్ఏ

అరుణాచల్ యువకుడిని భారత్ కు అప్పగించిన పీఎల్ఏ

Missing Arunachal Teen : అరుణాచల్‌ ప్రదేశ్‌ లో వాచా- దమై మధ్య ఉన్న ఇంటరాక్షన్ పాయింట్ వద్ద మిరామ్ టారోన్ ను ఇండియన్ ఆర్మీకి అప్పగించింది పీఎల్ఏ([చైనా ఆర్మీ). ఆ యువకుడు ఇప్పటి వరకు పొరుగు దేశం ఆర్మీ వద్ద ఉన్న నేపథ్యంలో అతడిని డ్రాగన్ సేనలు ఏమైనా ఇబ్బంది పెట్టాయా? ఏవైనా సెన్సర్లు అమర్చడం లాంటివి చేశారా? ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? లాంటి అన్ని విషయాలపై నిశితంగా ఆర్మీ పరీక్షించనుంది.

ఇంకా చదవండి ...

PLA Hands Over  Arunachal Teen :  అరుణాచల్ ​ప్రదేశ్​ షియాంగ్ జిల్లాలోని సియుంగ్లా ప్రాంతానికి చెందిన 17ఏళ్ల యువకుడు మిరామ్ టారోన్ ఈ నెల 18న బోర్డర్ లో తప్పిపోవడం, తమ భూభాగంలో ఆ యువకుడిని గుర్తించినట్లు నాలుగు రోజుల క్రితం చైనా ఆర్మీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ యువకుడు ఎప్పుడు దేశానికి చేరుకుంటాడా అని అందరూ ఎదురుచూస్తున్న నేపథ్యంలో అధికారిక ప్రక్రియ పూర్తి చేసి ఇవాళ చైనా ఆర్మీ... మిరామ్ టారోన్ ను మన సేనలకు అప్పగించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ లో వాచా- దమై మధ్య ఉన్న ఇంటరాక్షన్ పాయింట్ వద్ద మిరామ్ టారోన్ ను ఇండియన్ ఆర్మీకి అప్పగించింది పీఎల్ఏ([చైనా ఆర్మీ). ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఓ ట్వీట్ లో తెలిపారు.

ALSO READ Rahul Vs Twitter : తగ్గిన రాహుల్ ట్విట్టర్ ఫాలోవర్స్..కారణం అదేనా!

ఆ యువకుడికి టెస్టులు చేయడం సహా మిగిలిన మిగిలిన ప్రాసెస్‌ను పూర్తి చేయనున్నట్లు రిజిజు తెలిపారు. ఆ యువకుడు ఇప్పటి వరకు పొరుగు దేశం ఆర్మీ వద్ద ఉన్న నేపథ్యంలో అతడిని డ్రాగన్ సేనలు ఏమైనా ఇబ్బంది పెట్టాయా? ఏవైనా సెన్సర్లు అమర్చడం లాంటివి చేశారా? ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? లాంటి అన్ని విషయాలపై నిశితంగా ఆర్మీ పరీక్షించనుంది.

బుధవారం రిపబ్లిక్‌ డే సందర్భంగా భారత్, చైనా ఆర్మీ అధికారులు హాట్‌లైన్‌ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఆ యువకుడిని భారత సైన్యానికి ఎక్కడ అప్పగించనుందన్న దానిపై చైనా క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత ఏ సమయంలో అప్పగిస్తారన్నది మరోసారి వెల్లడించడంతో ఆ మేరకు మన ఆర్మీ ఏర్పాట్లు చేసిందని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. ఇక,ఈ కేసులో చాలా జాగ్రత్తగా వ్యవహరించి, ఆ యువకుడిని సేఫ్‌గా స్వదేశానికి తీసుకొచ్చినందుకు ఇండియన్ ఆర్మీకి రిజిజు ధన్యవాదాలు చెప్పారు.


అరుణాచల్ ప్రదేశ్‌లోని షియాంగ్ జిల్లాలోని జిడో గ్రామానికి చెందిన మిరామ్ టారోన్ ని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసినట్లుగా తొలుత వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. భారత భూబాగం నుంచి ఆ బాలుడిని చైనా ఆర్మీ అపహరించిందని అరుణాచల్ తూర్పు జిల్లాఎంపీ తపిర్ గావో ఆరోపించారు. చైనా ఆర్మీ చెర నుంచి తప్పించుకున్న మరో యువకుడు.. స్థానిక అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేసినట్లు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఘటన జరిగినప్పుడు టారోన్, మరికొంత మందితో కలిసి రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో వేట సాగిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. అయితే, యువకుడు కిడ్నాప్ కాలేదని, తప్పిపోయాడని అధికారులు తర్వాత వివరణ ఇచ్చారు. తప్పిపోయిన మిరామ్ టారోన్ గురించి వెంటనే ఆర్మీ.. పీఎల్ఏని సంప్రదించింది. బాలుడి ఆచూకీ కోసం చైనా ఆర్మీ సాయం కోరినట్లు భారత సైన్యం పేర్కొంది. ఈ క్రమంలో యువకుడి ఆచూకీ కనుగొన్నట్లు చైనా సైన్యం నాలుగు రోజుల క్రితం భారత్​కు సమాచారం ఇచ్చింది. ఇవాళ ఆ యువకుడిని భారత ఆర్మీకి అప్పగించింది.

First published:

Tags: Arunachal Pradesh, China, Indian Army, Missing cases

ఉత్తమ కథలు