రైల్వే మంత్రి వందేమాతరం ఎక్స్‌ప్రెస్ వీడియో ట్వీట్‌పై వివాదం

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోస్ట్ చేసిన ‘వందేమాతరం ఎక్స్‌ప్రెస్’ వేగాన్ని ఫాస్ట్ ఫార్వార్డ్ చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు, నెటిజన్లు విమర్శిస్తున్నారు.

news18-telugu
Updated: February 11, 2019, 6:37 PM IST
రైల్వే మంత్రి వందేమాతరం ఎక్స్‌ప్రెస్ వీడియో ట్వీట్‌పై వివాదం
వందేమాతరం ఎక్స్‌ప్రెస్
  • Share this:
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వందే మాతరం ఎక్స్‌ప్రెస్(ట్రైన్ 18) వీడియో చుట్టూ వివాదం రాజుకుంది. దేశంలో అత్యంత వేగంగా నడిచే రైలుగా దీనికి గుర్తింపు ఉంది. న్యూఢిల్లీ-వారణాసి మధ్య ఈ రైలు సేవలను ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పీయూష్ గోయల్ ఈ రైలు ఓ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాంను దాటుకుని వెళ్తున్న ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఆదివారం ట్వీట్ చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా తయారు చేసిన ఈ రైలు కాంతివేగంలో దూసుకెళ్తోందంటూ పీయూష్ ఆ ట్వీట్‌కు క్యాప్షన్ పెట్టారు.

అయితే ఈ రైలు వాస్తవానికి అంత వేగంగా ప్రయాణించడం లేదని ట్విట్టర్‌లో ట్రోల్స్‌తో దంచేస్తున్నారు. ఈ వీడియోను ‘ఫాస్ట్ ఫార్వార్డ్’ చేశారని, రైల్వే మంత్రి ఆ వీడియోను పోస్ట్ చేసి గొప్పలు చెప్పుకోవడం సరికాదంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సామాన్య నెటిజన్లు కూడా ఈ వీడియో అసలైనది కాదని విమర్శిస్తున్నారు. వాస్తవాన్ని వాస్తవంగా చూపితే బాగుంటుందని, వాస్తవాలను వక్రీకరించి ఇలా ఎంతకాలం గొప్పలుచెప్పుకుంటారని కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ సుందర్ ప్రశ్నించారు. ఇది డిజిటల్ యుగమని, బీజేపీ మాయమాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని కామెంట్ చేశారు.అటు బీజేపీ కార్యకర్తలు ఈ వీడియో పోస్టింగ్‌ను సమర్థించుకుంటున్నారు. వందేమాతరం ఎక్స్‌ప్రెస్ రైలు వేగం పట్ల అనుమానాలున్న వారు టిక్కెట్ కొనుగోలు చేసి, అందులో ప్రయాణించి నిజానిజాలు నిర్థారించుకోవాలని సూచిస్తున్నారు.
First published: February 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు