RCEP : యూపీఏ హయాంలో కొంపముంచారు... సోనియా గాంధీకి పియూష్ గోయల్ కౌంటర్

Piyush Goyal vs Sonia Gandhi : 2007లో ఇండియా-చైనా మధ్య FTA కుదిరినప్పుడు సోనియా గాంధీ ఎక్కడున్నారో చెప్పాలన్న పియూష్ గోయల్... దీనిపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యతిరేకంగా మాట్లాడితే... అది ఆయనకే అవమానం అవుతుందన్నారు.

news18-telugu
Updated: November 3, 2019, 11:50 AM IST
RCEP : యూపీఏ హయాంలో కొంపముంచారు... సోనియా గాంధీకి పియూష్ గోయల్ కౌంటర్
పియూష్ గోయల్, సోనియా గాంధీ
  • Share this:
Piyush Goyal on RCEP : కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక శాఖ మంత్రి పియూష్ గోయల్... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆసియన్ సభ్య దేశాలతో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (RCEP), అతిపెద్ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) కుదుర్చుకుంటుండటాన్ని సోనియాగాంధీ తప్పు పట్టారు. దీనిపై కౌంటరేసిన పియూష్ గోయల్... కాంగ్రెస్ హయాంలోని యూపీఏ ప్రభుత్వమే ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు సంప్రదింపులు జరిపిందన్న విషయాన్ని గుర్తుచేశారు. RCEP, FTAలపై సోనియాగాంధీ ఇప్పుడు నిద్రలేచారా అంటూ ట్వీట్ చేసిన గోయల్... 2010లో ఆసియన్ సభ్య దేశాలతో FTAపై సంతకాలు జరిగినప్పుడు ఆమె ఎక్కడున్నారని ప్రశ్నించారు. 2010లో దక్షిణ కొరియాతో FTA కుదుర్చుకున్నప్పుడు, 2011లో మలేసియా, జపాన్ దేశాలతో ఇదే ఒప్పందం కుదిరినప్పుడు సోనియా ఏం చేస్తున్నారని నిలదీశారు గోయల్.
Loading...

ఆసియన్ సభ్య దేశాలు భారత్‌లో వాణిజ్యం జరుపుకునేందుకు 74 శాతం మార్కెట్ ఇచ్చిన యూపీఏ ప్రభుత్వం... అభివృద్ధి చెందిన ఇండొనేసియా లాంటి దేశాలు మాత్రం భారత్‌కి 50 శాతం మార్కెట్టే ఇచ్చినప్పుడు సోనియా ఎక్కడున్నారని కూడా ప్రశ్నించారు పియూష్ గోయల్. అభివృద్ధి చెందిన దేశాలకు యూపీఏ ప్రభుత్వం అడ్డగోలుగా వెసులుబాట్లు కల్పించినప్పుడు సోనియా గాంధీ ఎందుకు మాట్లాడలేదని కౌంటరేశారు గోయల్.


2007లో ఇండియా-చైనా మధ్య FTA కుదిరినప్పుడు సోనియా గాంధీ ఎక్కడున్నారో చెప్పాలన్న పియూష్ గోయల్... దీనిపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యతిరేకంగా మాట్లాడితే... అది ఆయనకే అవమానం అవుతుందన్నారు.


ఆసియా దేశాలతో భారత ప్రభుత్వ RCEP అగ్రిమెంట్‌ను శనివారం వ్యతిరేకించిన సోనియాగాంధీ... దీని వల్ల దేశంలో రైతులు, షాపులు, చిన్న వ్యాపారులు రోడ్డున పడతారని అన్నారు. ఇప్పటికే తీసుకున్న ఆర్థిక నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న నష్టం చాలదా అంటూ కేంద్రంపై ఫైర్ అయిన సోనియా... ఇప్పుడు కొత్తగా ఏం ఒరగబెడదామని 16 ఆసియా దేశాలతో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (RCEP) కుదుర్చుకుంటున్నారని మండిపడ్డారు.


ఆమెకు ట్విట్టర్ ద్వారా సమాధానం చెప్పిన పియూష్ గోయల్... 2004లో $7బిలియన్లుగా ఉన్న వాణిజ్య లోటు... 2014లో $78 బిలియన్లకు చేరినప్పుడు సోనియా గాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. 2011-12లో సోనియాగాంధీ ఒత్తిడి చెయ్యడం వల్లే... కేంద్ర ప్రభుత్వం చైనాతో RCEP సంప్రదింపులు జరిపిందని గుర్తుచేశారు.


RCEP ద్వారా సమగ్ర సత్ఫలితాలు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారన్న పియూష్ గోయల్... ఆయన కోరుకుంటున్నట్లుగా ఈ ఒప్పందం ఆసియా దేశాలన్నింటికీ కలిసొస్తుందని, అలాంటి ఫలితం రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్య లోటు, అనిశ్చితిపై భారత ప్రభుత్వం తన వైపు నుంచీ సమస్యల్ని వివరిస్తూ... తగిన మేలు పొందేందుకు ప్రయత్నిస్తుందన్నారు.


RCEP అనేది 16 ఆసియా దేశాలు కుదుర్చుకుంటున్న కీలకమైన ఒప్పందం. దీనిపై బ్యాంకాక్‌లో ఆసియా దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ కూడా అక్కడే ఉన్నారు. RCEP వాణిజ్య మంత్రులతో ఆయన చర్చిస్తున్నారు. నవంబర్ 4న బ్యాంకాక్‌లో RCEP సదస్సు జరగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

 

Pics : సెలబ్రిటీలను కట్టిపడేస్తున్న ఆస్థా శర్మ ఫ్యాషన్ డిజైన్స్



ఇవి కూడా చదవండి :

Bigg Boss 3 | శ్రీముఖి డ్రెస్ డిజైనర్ ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో జబర్దస్త్ కామెడీ షో... ఇక పంచ్‌ల తుఫానే

ఆ విషయంలో జగన్ కంటే చంద్రబాబే బెస్ట్... కార్మికుల మాట

పోలీసులకు షాక్... సెలవులు రద్దు

IND vs BAN | నేడు ఇండియా బంగ్లాదేశ్ తొలి టీ20... పొగే సమస్య
First published: November 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com