హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Fact Check:ఈ చైనా మొబైల్ యాప్స్‌ని కేంద్రం నిషేధించిందా?

Fact Check:ఈ చైనా మొబైల్ యాప్స్‌ని కేంద్రం నిషేధించిందా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనాకు చెందిన కొన్ని మొబైల్ యాప్స్‌ను ఇండియాలో నిషేధిస్తున్నారని, వాటి పనితీరును పరిమితం చేయాలని టెక్ కంపెనీలకు కేంద్రం సూచిస్తున్నట్టు నకిలీ ఉత్తర్వులను ఎవరో సృష్టించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చైనాకు చెందిన కొన్ని మొబైల్ యాప్స్‌ను ఇండియాలో నిషేధిస్తున్నారన్న ప్రచారం వైరల్‌గా మారింది. వాస్తవానికి ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరగడం.. ఏది వాస్తవమో.. ఏదీ కాదో తేల్చుకోకుండా ఇతరులకు సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా నకిలీ వార్తల బెడద ఎక్కువవుతోంది. నకిలీ వార్తలపై ఇటు ప్రభుత్వాలు.. అటు ఆయా సంస్థలు నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్నా.. ఆగడం లేదు. కొంతమంది సదరు సమాచారంపై అవగాహన లేకపోవడం.. మరికొంతమంది కావాలనే దుష్ప్రచారం చేసేందుకు నకిలీ వార్తలను పుట్టిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దాని ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో చైనాకు చెందిన కొన్ని మొబైల్ యాప్స్‌ను ఇండియాలో నిషేధిస్తున్నారని, వాటి పనితీరును పరిమితం చేయాలని టెక్ కంపెనీలకు కేంద్రం సూచిస్తున్నట్టు నకిలీ ఉత్తర్వులను ఎవరో సృష్టించారు.

గూగుల్, యాపిల్ సంస్థలకు కేంద్ర టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, జాతీయ సమాచార కేంద్రం(ఎన్ఐసీ) జీఓ జారీ చేసినట్టు ఆ పోస్టులో చూపిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇండియాలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగించే వారు చైనాకు చెందిన 13 యాప్స్ పనితీరును తగ్గించాలని అందులో పేర్కొన్నారు. ఆ యాప్స్ జాబితాలో లైవ్ మి, టిక్ టాక్, బిగో లైవ్, విగో వీడియో, బ్యూటీ ప్లస్, కామ్ స్కానర్, క్లాష్ ఆఫ్ కింగ్స్, మొబైల్ లెజెండ్స్, క్లబ్ ప్యాక్టరీ, షీన్, రోమ్ వే, యాప్ లాక్, వీమేట్ వంటి యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.

దీన్ని చాలామంది వాస్తవం అనుకుని తెగ షేర్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) స్పందించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులన్నీ నకిలీ అని పీఐబీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. అది నకిలీ పోస్టు అని, ఎన్ఐసీ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, అది పూర్తిగా నకిలీ సమాచారం అని తేల్చి చెప్పింది. నెటిజన్లు వాటిని నమ్మోద్దని, ఇలాంటి ఫేక్ న్యూస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

First published:

Tags: China, Corona virus, Mobile App

ఉత్తమ కథలు