హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Fact Check: వారందరికీ రూ.70వేలు.. పీఎం పెన్షన్ యోజన.. అసలు ఇందులో నిజమెంత?

Fact Check: వారందరికీ రూ.70వేలు.. పీఎం పెన్షన్ యోజన.. అసలు ఇందులో నిజమెంత?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Fact Check: ప్రధాన మంత్రి పెన్షన్ యోజన పేరిట ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పీఎం పెన్షన్ యోజన కింద అర్హులకు కేంద్రం రూ.70 వేలు అందిస్తోందని ఫోన్‌లకు సందేశాలు వస్తున్నాయి.

ఫేస్‌బుక్, ట్విటర్ ఓపెన్ చేస్తే చాలు.. ఏవేవో పోస్టులు కనిపిస్తున్నాయి. వేలాది వార్తలు దర్శనమిస్తాయి. ఇవి చాలదన్నట్లు వాట్సప్‌కు కుప్పలు తెప్పలుగా వార్తలు సందేశాల రూపంలో వస్తున్నాయి. మరి అందులో ఏవి నిజమైనవి? ఏవి తప్పుడు ప్రచారాలో.. తెలియక జనాలు తికమకపడుతున్నారు. సోషల్ కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే అసత్య ప్రచారాలను నిజమని నమ్ముతున్నారు. తాజాగా ప్రధాన మంత్రి పెన్షన్ యోజన పేరిట ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పీఎం పెన్షన్ యోజన కింద అర్హులకు కేంద్రం రూ.70 వేలు అందిస్తోందని ఫోన్‌లకు సందేశాలు వస్తున్నాయి.

''కంగ్రాట్స్. 70 వేల రూపాయల పీఎం పెన్షన్ యోజన పథకానికి మీరు అర్హత సాధించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.'' ఓ సందేశం చాలా మందికి వస్తోంది. ఈ ప్రచారంపై PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇందులో నిజంలేదని.. ఇది ఫేన్ న్యూస్ అని కొట్టిపారేసింది. పీఎం పెన్షన్ 2020 యోజన పేరిట కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని తీసుకురాలేదని స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.


కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అంశాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే..

First published:

Tags: Fact Check, VIRAL NEWS

ఉత్తమ కథలు