హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Fact Check: 'విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు'.. ఈ పథకంపై కేంద్రం క్లారిటీ

Fact Check: 'విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు'.. ఈ పథకంపై కేంద్రం క్లారిటీ

అయితే 50 శాతం మంది ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరయ్యేలా చూసుకోవాలని అన్నారు.

అయితే 50 శాతం మంది ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరయ్యేలా చూసుకోవాలని అన్నారు.

''కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోంది.. ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి.'' అందూ కొందరు మెసేజ్ పంపిస్తున్నారు. వాట్సప్‌లో వైరల్ అయిన ఆ సందేశంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది.

కరోనా కారణంగా మార్చి నుంచి స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ఈ కోవిడ్ మహమ్మారి దెబ్బకు ఆన్‌లైన్ క్లాస్‌లు వచ్చేశాయి. కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు స్కూల్ పిల్లలకు కూడా ఆన్‌లైన్‌లోనే క్లాసులు చెబుతున్నారు. ఇప్పుడంతా ఆన్‌లైన్ హవా నడుస్తోంది. జూమ్, గూగుల్ మీట్, జియో మీట్ వంటి యాప్స్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఐతే స్మార్ట్ ఫోన్‌లు, లాప్‌టాప్‌లు లేని కారణంగా చాలా మంది విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పేరిట ఓ సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విద్యార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నది దాని సారంశం.

''కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోంది.. ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి.'' అందూ కొందరు మెసేజ్ పంపిస్తున్నారు. వాట్సప్‌లో వైరల్ అయిన ఆ సందేశంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఇందులో నిజంలేదని.. ఇది ఫేన్ న్యూస్ అని కొట్టిపారేసింది. పీఎం పెన్షన్ 2020 యోజన పేరిట కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని తీసుకురాలేదని స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.


ఫేస్‌బుక్, ట్విటర్‌లో గంటకో ఇలాంటి పుకారు షికారు చేస్తోంది. వాట్సప్‌కు కుప్పలు తెప్పలుగా సందేశాలు వస్తున్నాయి. అందులో ఏవి నిజమైనవి? ఏవి తప్పుడు ప్రచారాలో.. తెలియక జనాలు తికమకపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అంశాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తోంది.

First published:

Tags: Fact Check, Fake news, Online classes