సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఏవేవో పోస్టులు కనిపిస్తున్నాయి. వేలాది వార్తలు దర్శనమిస్తాయి. మరి అందులో ఏవి నిజమైనవి? ఏవి తప్పుడు ప్రచారాలో.. తెలియక జనాలు తికమకపడుతున్నారు. ఫేస్బుక్, ట్విటర్లో కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే అసత్య ప్రచారాలను నిజమని నమ్ముతున్నారు. తాజాగా భారత క్షిపణి ప్రయోగానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల భారత ఆర్మీ (IndianArmy) చేపట్టిన బ్రహ్మోస్ (BrahMos) సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ (ఉపరితల నుంచి ఉపరితలం) ప్రయోగం విఫలమైందని కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. భారత క్షిపణి ప్రయోగం విఫలమైందని ప్రచారం చేస్తున్నారు.
ఈ ప్రచారంపై PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇందులో నిజంలేదని.. ఇది ఫేన్ న్యూస్ అని కొట్టిపారేసింది. నవంబరు 24న భారత సైన్యం చేపట్టిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగం విజయవంతమైందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.
Claim: A fake news peddling Twitter account has claimed that the Indian Army's surface-to-surface supersonic cruise missile failed while testing.#PIBFactCheck: The claim is #Fake. @adgpi successfully launched its #BrahMos supersonic cruise missile on November 24, 2020. pic.twitter.com/nEY2mainBq
— PIB Fact Check (@PIBFactCheck) November 27, 2020
కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అంశాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check, Indian Army