హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gujarat HC : వ్యభిచారాన్ని నిరూపించేందుకు ఫొటోలు మాత్రమే సరిపోవు.. కోర్టు సంచలన తీర్పు

Gujarat HC : వ్యభిచారాన్ని నిరూపించేందుకు ఫొటోలు మాత్రమే సరిపోవు.. కోర్టు సంచలన తీర్పు

గుజరాత్ హైకోర్టు  ఫైల్ ఫొటో

గుజరాత్ హైకోర్టు ఫైల్ ఫొటో

Gujarat HC : కోర్టు కేసుల్లో తీర్పులు చాలా ఆసక్తిగా ఉంటాయి. రెండు ట్విస్టులు ఉన్న ఓ కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు... అందర్నీ ఆలోచనలో పడేసింది. కుటుంబాల్లో వచ్చే సమస్యలు ఇంతింత కాదయా అని అందరూ అనుకున్నారు. అసలు ఆ కేసేంటి? ఆ ట్విస్టులేంటి? ఈ తీర్పేంటి? తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తన భార్య వ్యభిచారం (adultery) చేస్తోంది అంటూ.. ఓ వ్యక్తి తెచ్చిన ఫొటోలను పరిశీలించిన గుజరాత్ హైకోర్ట్.. ఇలాంటి ఆరోపణలకు ఫొటోలు మాత్రమే ఆధారాలుగా చూపిస్తే సరిపోదనీ.. అవి చట్టం ముందు సాక్ష్యాలుగా సరిపోవని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో అతనికి దిమ్మ తిరిగింది. ఐతే.. ఇక్కడే ఈ కేసులో ట్విస్టులున్నాయి.

తన భార్యకు సంబంధించి.. అతను అలా కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాడన్నది అసలు కోణం. దాని వెనక ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏంటంటే.. అతని భార్య ఓ వివాదంలో తన భర్తకు వ్యతిరేకంగా అహ్మదాబాద్‌లోని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లింది. తనకూ, తన కూతురికీ మధ్యంతర మెయింటెనెన్స్ కోసం నెల నెలా డబ్బు ఇప్పించేలా తన భర్తకు ఆదేశం ఇవ్వమని కోరింది. ఆమె వాదనతో ఏకీభవించిన ఫ్యామిలీ కోర్టు... ఆమెకు నెలకు రూ.30వేల చొప్పున చెల్లించమని ఆదేశించింది.

వెంటనే అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేశాడు. "నా భార్య వ్యభిచారం చేస్తోంది. కాబట్టి నేను మధ్యంతర మెయింటెనెన్స్ చెల్లించాల్సిన పనిలేదు. పైగా నేను నెల నెలా రూ.30వేలు చెల్లించలేను. నాకు అంత సీన్ లేదు. కావాలంటే చూడండి అంటూ.. తన భార్యకు సంబంధించిన ఫొటోలతోపాటూ.. ఇన్‌కంటాక్స్ రిటర్నులను కూడా కోర్టుకు ఇచ్చాడు.

దాంతో అతని భార్య హైకోర్టులో తన వాదన వినిపించింది. తన భర్తకు ఉన్న లగ్జరీ కార్లు, వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, భర్త పేరున ఉన్న ఆస్తుల పత్రాలు ఇచ్చింది. అంతేకాదు.. తన భర్తకు 150 ఆటోలు ఉన్నాయనీ.. వాటి ద్వారా నెల నెలా అద్దెలు కూడా వస్తున్నాయని తెలిపింది. అంతేకాదు.. తన భర్త ఓ ఆర్టీఓ దగ్గర ఏజెంటుగా చేస్తున్నాడనీ.. అలాగే ఓ ఫైనాన్స్ సంస్థను కూడా నడుపుతున్నాడని తెలిపింది. దాని పేరు ఉమియా ఆటోమొబైల్స్ అని చెప్పింది. ఆమె ఇచ్చిన పత్రాలు, ఫొటోలను పరిశీలించిన కోర్టు.. నెలకు రూ.30వేల చొప్పున చెల్లించడం అనేది అతనికి కష్టం కాదని భావించింది.

అందువల్ల ఆమెకు నెల నెలా మనీ చెల్లించాలని చెబుతూ... అదే సమయంలో.. అతను చేసిన వ్యభిచార ఆరోపణలను కొట్టిపారేస్తూ నవంబర్ 29, 2022న తీర్పు ఇచ్చింది. ఇదంతా పరిశీలిస్తే మనకు ఓ విషయం అర్థమవుతుంది. భార్యతో విబేధాలు ఉన్న అతను.. ఎలాగైనా ఆమెకు డబ్బు చెల్లించకూడదు అనే ఉద్దేశంతో.. ఈ వ్యభిచార డ్రామా ఆడినట్లు కనిపిస్తోంది. ఇలాంటి ఆరోపణలు చేస్తే.. కోర్టులో తానే నెగ్గుతాను అనుకొని ఉంటాడు. అందుకే హైకోర్టు సైతం.. అతని కుట్ర కోణాన్ని గుర్తించి.. ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తోంది.

First published:

Tags: Gujarat, National News

ఉత్తమ కథలు