హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటో పెట్టాలి..కేంద్రం ముందు కేజ్రీవాల్ సంచలన డిమాండ్

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటో పెట్టాలి..కేంద్రం ముందు కేజ్రీవాల్ సంచలన డిమాండ్

Credit to: Twitter

Credit to: Twitter

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Kejriwal) సంచలన కామెంట్స్ చేశారు. కరెన్సీ నోట్లపై లక్మిదేవి, వినాయకుడి ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. గుజరాత్,  హర్యానా ఎన్నికల ముందు కేజ్రీవాల్  (Kejriwal) హిందూ తత్వాన్ని లేవనెత్తారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Kejriwal) సంచలన కామెంట్స్ చేశారు. కరెన్సీ నోట్లపై లక్మిదేవి, వినాయకుడి ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. గుజరాత్,  హర్యానా ఎన్నికల ముందు కేజ్రీవాల్  (Kejriwal) హిందూ తత్వాన్ని లేవనెత్తారు. గాంధీజీతో పాటు లక్మిదేవి, వినాయకుడి ఫోటో పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన కరెన్సీకి ఒకవైపు గాంధీజీ మరోవైపు లక్ష్మీ, గణేష్ బొమ్మలు వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని (Narndra Modi) కోరుతున్నానని అన్నారు. అన్ని నోట్లను మార్చాలని మేము చెప్పడం లేదు. కొత్తగా ముద్రించే నోట్లపై గాంధీ బొమ్మతో పాటు లక్ష్మీ, గణేష్ బొమ్మలను వేయాలని డిమాండ్ చేశారు.

Relationship: ఆఫీసులో పని చేయడం ఇష్టం లేదా? మానసిక వ్యాధి కావచ్చు హెచ్చరిక..!

I appeal to the central govt & the PM to put the photo of Shri Ganesh Ji & Shri Laxmi Ji, along with Gandhi Ji's photo on our fresh currency notes, says Delhi CM & AAP national convenor Arvind Kejriwal pic.twitter.com/t0AWliDn75

— ANI (@ANI) October 26, 2022

ఢిల్లీలో దీపావళి నాడు బాణాసంచా కాల్చడాన్ని నిషేధించారు. దీనితో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Aravindh Kejriwal) హిందూ వ్యతిరేకి అని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కేజ్రీవాల్ (Kejriwal) మాట్లాడుతూ..ప్రతి కుటుంబం ధనవంతులు కావాలని మేము కోరుకుంటున్నాం. దీని కోసం అనేక చర్యలు తీసుకోవలసి ఉంటుంది. మంచి పాఠశాలలు, ఆసుపత్రులు, మౌలిక వసతులు ఉంటాయి. ఇండోనేషియా ముస్లిం దేశమని కేజ్రీవాల్ (Kejriwal) అన్నారు. అక్కడి జనాభాలో 85 శాతం ముస్లింలు, 2 శాతం హిందువులు ఉన్నప్పటికీ వారి కరెన్సీపై గణేష్ చిత్రాన్ని ముద్రించారు. అందుకే భారత కరెన్సీపై కూడా గాంధీజీ బొమ్మతో పాటూ లక్ష్మీ, గణేష్ బొమ్మలు ముద్రించాలని ప్రధాని నరేంద్ర మోడీని (Narndra Modi) కోరారు.

దీపావళి సందర్బంగా లక్ష్మీ -గణేష్ పూజ చేస్తున్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందని కేజ్రీవాల్ (Kejriwal) అన్నారు. దేవుని ఫోటోలు ముద్రించడం వల్ల భగవంతుని ఆశీస్సులు పొందుతారని అన్నారు. ఇండోనేషియా ఈ పని చేయగలిగితే మనం ఎందుకు చేయలేం అని కేజ్రీవాల్ (Kejriwal) అన్నారు.

First published:

Tags: Bjp, Currency, Kejriwal, Narendra modi

ఉత్తమ కథలు