హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PFI Plans: ప్రధాని మోదీపై దాడికి పీఎఫ్‌ఐ కుట్ర.. ఘర్షణలు సృష్టించేందుకు ప్రణాళికలు.. వెల్లడించిన ఈడీ

PFI Plans: ప్రధాని మోదీపై దాడికి పీఎఫ్‌ఐ కుట్ర.. ఘర్షణలు సృష్టించేందుకు ప్రణాళికలు.. వెల్లడించిన ఈడీ

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

బిహార్ రాజధాని పాట్నాలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీని టార్గెట్ చేసేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేసిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. మోదీపై దాడికి విఫలయత్నం చేసిందని, ఇందుకు కొంతమందికి శిక్షణ ఇచ్చిందని పేర్కొంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

దేశంలో మత ఘర్షణలు సృష్టించేందుకు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను అందించడంతో పాటు యువతకు శిక్షణ(Training) ఇస్తున్నారనే ఆరోపణలతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతలను కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో భాగంగా ఎన్‌ఐఏ, ఈడీ(ED) అధికారులు విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో విస్తుబోయే విషయం ఒకటి బయటకు వచ్చింది. బిహార్ రాజధాని పాట్నాలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీని టార్గెట్ చేసేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్లాన్(Front Of India) చేసిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Directorate) తెలిపింది. మోదీపై దాడికి విఫలయత్నం చేసిందని, ఇందుకు కొంతమందికి శిక్షణ ఇచ్చిందని పేర్కొంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని సున్నితమైన ప్రదేశాలు, వ్యక్తులపై ఏకకాలంలో దాడులు చేసేందుకు టెర్రర్ మాడ్యూల్స్, మారణాయుధాలు, పేలుడు పదార్థాల సేకరణకు ప్రణాళిక రచించినట్లు ఈడీ పేర్కొంది.

గురువారం జరిపిన ఆపరేషన్‌లో కేరళలో అరెస్టయిన పీఎఫ్‌ఐ సభ్యుడు షఫీక్ పాయెత్‌పై ఈడీ తాజాగా రిమాండ్ నోట్‌ ఫైల్ చేసింది. ఈ ఏడాది జులై 12న ప్రధాని నరేంద్ర మోదీ పాట్నా పర్యటన సందర్భంగా దాడి చేసేందుకు పీఎఫ్‌ఐ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసిందని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ సంస్థ కొన్నేళ్లుగా రూ. 120 కోట్ల వివరాలను సేకరించినట్లు ED గుర్తించింది. ఈ మొత్తం ఎక్కువగా నగదు రూపంలోనే ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా అల్లర్లతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఈ నిధులను ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది.

Shrikant Shinde: తండ్రి లేనప్పుడు కొడుకుదే రాజ్యం.. సీఎం సీటులో ఆయన కుమారుడు.. ఫొటోలు వైరల్

* అక్రమంగా నిధుల సేకరణ

ఒకప్పుడు ఖతార్‌లో నివసించిన పాయెత్, దేశంలో అవాంతరాలు సృష్టించడం కోసం విదేశాల నుంచి PFIకి మనీ ట్రాన్స్‌ఫర్ చేశాడని, ఇందుకు ఇండియాలోని తన NRI అకౌంట్‌ను అక్రమంగా ఉపయోగించాడని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ED గత సంవత్సరం కూడా పాయెత్ ఆఫీస్‌లపై దాడి చేసింది. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి, ఆ నిధులను అక్రమంగా PFIకి మళ్లించినట్లు ఏజెన్సీ గుర్తించింది. గత కొన్ని సంవత్సరాలుగా PFI, సంబంధిత సంస్థల అకౌంట్లలో రూ. 120 కోట్ల కంటే ఎక్కువ డబ్బు జమ అయిందని.. దేశ విదేశాల నుంచి తెలియని, అనుమానాస్పద మూలాల నుంచి చాలా ఎక్కువ భాగం నగదు రూపంలో జమ చేశారని ఏజెన్సీ పేర్కొంది. అన్నారు.

* ఏజెన్సీల కస్టడీలో ప్రముఖులు..

దేశవ్యాప్తంగా పీఎఫ్ఐతో సంబంధం ఉన్న 100 మందికి పైగా కార్యకర్తలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో సహా అనేక ఏజెన్సీలు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో గురువారం దేశవ్యాప్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో ఏజెన్సీ నలుగురు PFI సభ్యులను అరెస్టు చేసింది.

సంస్థకు చెందిన మరో ముగ్గురు ఆఫీస్ బేరర్లు పర్వేజ్ అహ్మద్, ఎండీ ఇలియాస్, అబ్దుల్ ముఖీత్‌లను ED ఢిల్లీలో అదుపులోకి తీసుకుంది. 2018 నుంచి PFIకి వ్యతిరేకంగా మనీలాండరింగ్ విచారణ ప్రారంభించినప్పటి నుంచి ఏజెన్సీ వారందరినీ చాలాసార్లు ప్రశ్నించింది.

ఇది కూడా చదవండి : పెరిగిన హిమాలయన్‌ వయాగ్రా లభ్యత.. కిలో రూ.12 లక్షలు.. ప్రత్యేకతలివే..

మత సామరస్యానికి భంగం కలిగించడం, అల్లర్లను రెచ్చగొట్టడం, భయాందోళనలు సృష్టించడం, యూపీలో ఘర్షణలు సృష్టించడంతో పాటు ముఖ్యమైన, సున్నితమైన ప్రదేశాలు, వ్యక్తులపై ఏకకాలంలో దాడులు చేసేందుకు మారణాయుధాలు, పేలుడు పదార్థాల సేకరణ లక్ష్యాలుగా సంస్థ ప్రణాళికలు రచించిందని ఈడీ పేర్కొంది. 2020 ఫిబ్రవరి నాటి ఢిల్లీ అల్లర్లు, PFI సభ్యుల హత్రాస్‌ సందర్శన వంటి ఘటనలతో ఈ సంస్థకు సంబంధం ఉందని, ఇందుకు నిధులను ఉపయోగించారని వెల్లడించింది. తాజా విచారణ సమయంలో PFIతో పాటు సంస్థ సభ్యులకు సంబంధించిన వివిధ బ్యాంక్ అకౌంట్లను విశ్లేషించారు. నిందితుల వాంగ్మూలాలను నమోదు చేశారు.

Published by:Veera Babu
First published:

Tags: Enforcement Directorate, National News, Pm modi

ఉత్తమ కథలు