హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Exclusive: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికీ PFI వ్యతిరేకం.. అన్నీ యాంటీ-ఇండియా యాక్టివిటీస్.. న్యూస్‌18తో నిఘా వర్గాలు

Exclusive: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికీ PFI వ్యతిరేకం.. అన్నీ యాంటీ-ఇండియా యాక్టివిటీస్.. న్యూస్‌18తో నిఘా వర్గాలు

Exclusive: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికీ PFI వ్యతిరేకం.. అన్నీ యాంటీ-ఇండియా యాక్టివిటీస్.. న్యూస్‌18తో నిఘా వర్గాలు

Exclusive: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికీ PFI వ్యతిరేకం.. అన్నీ యాంటీ-ఇండియా యాక్టివిటీస్.. న్యూస్‌18తో నిఘా వర్గాలు

రాడికల్ ఇస్లామిక్ గ్రూప్‌గా మారిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా.. ముస్లింలతో సహా దేశంలోని అన్ని వర్గాలలో ఉద్రిక్తతలకు ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తోందని అగ్రశ్రేణి నిఘా వర్గాలు CNN-News18కి తెలిపాయి. ఆ వివరాలు..

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ముస్లిం వర్గాల్లో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వారికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(Popular Front Of India) సంస్థ అసలు ఉద్దేశం వేరని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలో తేలింది. పీఎఫ్‌ఐ సభ్యుల అరెస్టుల తర్వాత ఈడీ రూపొందించిన రిమాండ్ రిపోర్టులో(Remand Report) సంస్థ ఉద్దేశాలు స్పష్టమయ్యాయి. ప్రధానిపై దాడిపై దాడి, ప్రముఖులు లక్ష్యంగా ఉగ్రవాద శిక్షణ శిభిరాల ఏర్పాటు, నిధుల మళ్లింపు గురించి ఈడీ రిమాండ్ రిపోర్టులో(ED Remand Report) పేర్కొంది. ఈ క్రమంలో రాడికల్ ఇస్లామిక్ గ్రూప్‌గా మారిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా.. ముస్లింలతో సహా దేశంలోని అన్ని వర్గాలలో ఉద్రిక్తతలకు ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తోందని అగ్రశ్రేణి నిఘా వర్గాలు CNN-News18కి తెలిపాయి.

PFI Plans: ప్రధాని మోదీపై దాడికి పీఎఫ్‌ఐ కుట్ర.. ఘర్షణలు సృష్టించేందుకు ప్రణాళికలు.. వెల్లడించిన ఈడీ

ఉగ్రవాద కార్యకలాపాల కోసం యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు నిధుల మళ్లింపు ఆరోపణలతో ఎన్‌ఐఏ, ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ ఆఫీసులపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన విచారణలో.. ఈ సంస్థ ఎల్లప్పుడూ సామాన్యులకు, ప్రభుత్వానికి మధ్య చీలికలు సృష్టించడానికి ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. PFI గత కార్యకలాపాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. అయోధ్య రామమందిరం విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సంస్థ తిరస్కరించింది. తీర్పు ముస్లింలకు వ్యతిరేకమని పేర్కొంది. అంతర్జాతీయంగా కూడా దీనికి వ్యతిరేకంగా ర్యాలీలు, సెమినార్లు నిర్వహించిందని అధికారులు న్యూస్‌18తో చెప్పారు.

* ఆ నిర్ణయాలకు వ్యతిరేకం

ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను PFI వివాదాస్పదంగా మార్చింది. ఇది ముస్లింల వ్యక్తిగత చట్టాలపై దురాక్రమణ అని పేర్కొంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA), పాన్-ఇండియా NRCని కూడా పీఎఫ్‌ఐ వ్యతిరేకించింది. ఈ క్రమంలో సంస్థ సభ్యత్వాలను పెంచుకోవడంతో పాటు విరాళాలను సేకరించడానికి ప్రజల భయాన్ని ఉపయోగించుకుందని, తరువాత షాహీన్ బాగ్ నిరసనకారులకు మద్దతు ఇచ్చిందని అధికారులు పేర్కొన్నారు.

Shrikant Shinde: తండ్రి లేనప్పుడు కొడుకుదే రాజ్యం.. సీఎం సీటులో ఆయన కుమారుడు.. ఫొటోలు వైరల్

అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)ని PFI వ్యతిరేకించింది. దీన్ని ముస్లిం వ్యతిరేక చర్యగా పేర్కొంది. ఎన్‌ఆర్‌సీ ముస్లింలలో భయాందోళనలను సృష్టించిందని సంస్థ ప్రచారం చేసిందని నిఘా అధికారులు తెలిపారు. ఈ క్రమంలో చాలామంది ఈ సంస్థలో చేరడానికి ప్రేరేపించిందని అధికారులు వెల్లడించారు. అలాగే ఇటీవల వార్తల్లో నిలిచిన జ్ఞానవ్యాపి మసీదు ఘటనపై పీఎఫ్‌ఐ చాలాసార్లు నేరుగా స్పందించిందని, ముస్లిం సమాజాన్ని ప్రేరేపించే ప్రయత్నంలో ఇది భాగమని అధికారులు తెలిపారు.

* కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయానికీ వ్యతిరేకం

PFI అనుబంధ సంస్థ అయిన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా.. ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానాన్ని తిరస్కరించింది. దేశంలో విద్యావ్యవస్థను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చాలని సంకల్పించిన నిర్ణయాన్ని సంస్థ తప్పుబట్టింది. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల లోయలోని ముస్లింలపై ప్రభావం పడుతుందని, ఇది ముస్లింల మెజారిటీని మార్చే ప్రయత్నం అని పీఎఫ్‌ఐ పేర్కొంది. ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని పీఎఫ్‌ఐ వ్యతిరేకించింది.

* అంతర్జాతీయ స్థాయిలో..

ఈ సంస్థ తన వెబ్‌సైట్‌లో భారత ప్రభుత్వ లోగోను ఉపయోగించుకుంటోందని, పాలస్తీనా సమస్యపై ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మాట్లాడిందని అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా మతపరమైన ప్రాతిపదికన ముందుకెళ్తోందని, ఇది భారత్-ఇజ్రాయెల్ సంబంధాన్ని ప్రభావితం చేస్తుందని అధికారులు తెలిపారు. NRC, CAAకి వ్యతిరేకంగా ఆందోళనల కోసం కెనడా, యూరప్‌ల నుంచి రోహింగ్యా నాయకులు నిధులు సేకరిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఐరోపా నుంచి నిధుల సేకరణ బాధ్యతలు చేపట్టిన యూరోపియన్ రోహింగ్యా కౌన్సిల్ (ERC) సభ్యుడు జహీర్ ఖాన్‌కు ఈ నిధులు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని PFI సభ్యులకు బంగ్లాదేశ్ ద్వారా నిధులు వస్తున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: India, News 18, PFI, Pm modi, Prime minister

ఉత్తమ కథలు