హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PFI Case: భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యం.. PFI కేసులో సంచలన విషయాలు

PFI Case: భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యం.. PFI కేసులో సంచలన విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PFI Case: గత కొన్నేళ్లుగా PFI, దాని అనుబంధ సంస్థల ఖాతాలలో 120 కోట్ల రూపాయలకు పైగా నగదు జమ అయినట్లు వెల్లడైంది. ఇందులో ఎక్కువ భాగం తెలియని, అనుమానాస్పద మూలాల నుంచే డబ్బు వచ్చింది

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  దేశవ్యాప్తంగా దుమారం రేపిన పీఎఫ్ఐ (Popular Front Of India) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు పాపులర్ ఫ్రంట్ ఇఫ్ ఇండియా లక్ష్యమేంటన్న వివరాలను ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. భారత్‌పై జిహాద్‌ ప్రకటించి, తద్వారా దేశంలో ఇస్లామిక్‌ రాజ్యాన్ని (Islamic State) స్థాపించాలన్న లక్ష్యంగా PFI ప్రణాళికలు రచిస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వెల్లడించింది. గురువారం దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఏకకాలంలో పీఎఫ్ఐ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతలు, కార్యకర్తల నివాసాలపై దాడులు చేసి.. పలువురరిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే శనివారం 10 మంది పీఎఫ్‌ఐ నాయకులను NIA ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచింది. నిందితులను తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రిమాండ్ నివేదికను గురువారమే సమర్పించింది. అందులో నిందితులపై తీవ్ర అభియోగాలను మోపింది. దేశ సమగ్రతకు భంగం కలిగించేందుకు పీఎఫ్ఐ కుట్రలు చేస్తోందని.. తాము నిర్వహించిన దాడుల్లోకీలక ఆధారాలు లభ్యమయ్యానని తెలిపింది.

  ఒక వర్గానికి చెందిన ప్రముఖ నేతలను హత్య చేసేందుకు పీఎఫ్‌ఐ కుట్ర పన్నిందని ఎన్ఐఏ పేర్కొంది. ఇందుకోసం జాబితాను కూడా సిద్ధం చేసిందని వెల్లడించింది. లష్కరే తయ్యబా, ఇస్లామిక్‌ స్టేట్, అల్‌ఖైదా లాంటి ఉగ్రసంస్థలతో పీఎఫ్‌ఐకు సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేసింది. ఆయా సంస్థల్లో భారతీయ యువత చేరేలా ప్రోత్సహిస్తోందని పేర్కొంది. భారత్‌పై జిహాద్‌ ప్రకటించి... ఉగ్రచర్యలతో ఇస్లామిక్‌ రాజ్యాన్ని స్థాపించేందుకు పీఎఫ్ఐ కుట్రలు చేసిందని పేర్కొంది. ఎన్ఐఏ నివేదికను పరిశీలించిన న్యాయస్థానం నిందితులను జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించింది.

  India in UNGA: కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌కు భారత్‌ ధీటైన జవాబు.. ఐరాసలో భారత ప్రతినిధిపై ప్రశంసలు

  పీఎఫ్ఐ సంస్థలపై దాడులకు ఎన్ఐఏ ఆపరేషన్ అక్టోబరు అని పేరు పెట్టినట్లు సమాచారం. సెప్టెంబర్ 22న 'ఆపరేషన్ ఆక్టోపస్' కింద దేశవ్యాప్తంగా ఎన్ఐఏ, ఈడీ, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం 15 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , ఢిల్లీ, కేరళ , కర్ణాటక , తమిళనాడు , ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్ , బీహార్, మణిపూర్ రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది. మొత్తం 96 చోట్ల జరిపిన దాడుల్లో 106 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో పిఎఫ్‌ఐ ఛైర్మన్‌ ఒఎంఎ సలామ్‌, వైస్‌ ఛైర్మన్‌ ఇఎం అబ్దుల్‌ రహీమ్‌, జాతీయ కార్యదర్శి నజరుద్దీన్‌ ఎలమారం, కేరళ రాష్ట్ర చీఫ్‌ సిపి ముహమ్మద్‌ బషీర్‌, నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ పి కోయా, ఎస్‌డిపిఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అబూ బకర్‌ ఉన్నారు.

  గత కొన్నేళ్లుగా PFI, దాని అనుబంధ సంస్థల ఖాతాలలో 120 కోట్ల రూపాయలకు పైగా నగదు జమ అయినట్లు వెల్లడైంది. ఇందులో ఎక్కువ భాగం తెలియని, అనుమానాస్పద మూలాల నుంచే డబ్బు వచ్చింది. విదేశాల నుంచి కూడా నగదును జమ చేశారు. ఈ నిధులతో అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఈడీ, ఎన్ఐఏ విచారణలో తేలింది.ఈ క్రమంలోనే ఆ సంస్థపై నిషేధం విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: NIA, PFI

  ఉత్తమ కథలు