హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PFI Ban: కేంద్రం సంచలన నిర్ణయం.. పీఎఫ్ఐ‌, దాని అనుబంధ సంస్థలపై నిషేధం

PFI Ban: కేంద్రం సంచలన నిర్ణయం.. పీఎఫ్ఐ‌, దాని అనుబంధ సంస్థలపై నిషేధం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PFI Ban in India: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ 2006లో ఏర్పాటయింది. మొదట కేరళలో ప్రారంభమై.. ఆ తర్వాత దేశమంతటా విస్తరించింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కొన్ని రోజులుగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) సంస్థను టార్గెట్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ఐ‌,  దాని అనుబంధ సంస్థలను చట్టవిరుద్ధ సంస్థలుగా ప్రకటించింది. UAPA (Unlawful Activities (Prevention) Act) కింద వాటిపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు కేంద్రహోంశాఖ గెజిట్ విడుదల చేసింది.  పీఎఫ్ఐ‌తో పాటు దాని అనుబంధ సంస్థలైన CFI, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్, రిహాబ్ఇండియా ఫౌండేషన్, నేషనల్ ఉమెన్ ఫ్రంట్ సంస్థలను కూడా చట్ట విరుద్ధమైన సంస్థలుగా ప్రకటించింది.  ఇకపై మనదేశంలో ఈ  సంస్థలు ఎలాంటి కార్యకలాపాలు చేయడానికి వీల్లేదు.

  పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ 2006లో ఏర్పాటయింది. మొదట కేరళలో ప్రారంభమై.. ఆ తర్వాత దేశమంతటా విస్తరించింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. మైనారిటీలు, దళితులు, అణగారిన వర్గాల సాధికారతే లక్ష్యంగా పనిచేయనున్నట్లు పేర్కొంది. అందుకోసం సామాజిక ఉద్యమాన్ని నడుపుతున్నట్లు వెల్లడించింది. కానీ ఈ ముసుగులో రాడికల్ ఇస్లాంను ప్రచారం చేస్తోందని భద్రతా సంస్థలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు పిలుపునివ్వడం, హింసాత్మక ఘటనలకు పాల్పడడం, కరాటే పేరుతో యువతకు ఉగ్రవాద శిక్షణ ఇవ్వడం, అమాయక యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు ప్రోత్సహించడం.. వంటి కార్యకలాపాలు చేస్తున్నట్లు పీఎఫ్ఐ‌పై ఆరోపణలున్నాయి.

  సెప్టెంబరు 22న ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో ఎన్ఐఏ (కేంద్ర దర్యాప్తు సంస్థ).. పీఎఫ్ఐ‌పై మెరుపు దాడులు చేసింది. ఏపీ, తెలంగాణ , కర్నాటక, తమిళనాడు , కేరళ , మహారాష్ట్ర , ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ , జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ , అసోం, బీహార్, రాజస్థాన్ సహా మొత్తం 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతలు, కార్యకర్తల ఇళ్లల్లో సోదాలు చేసి.. దాదాపు వంద మందికి పైగా అరెస్ట్ చేసింది. సోదాల్లో ల్యాప్‌టాప్స్, పెన్‌డ్రైవ్స్ సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నేతల విచారణలో కీలక వివరాలను రాబట్టారు. మంగళవారం కూడా పలు రాష్ట్రాల్లో సోదాలు జరిగాయి. అస్సాంలో 25 మందిని, మహారాష్ట్రలో నలుగురు, ఢిల్లీలో 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 21 మందిని, గుజరాత్‌లో 10 మందిని, కర్ణాటకలో కూడా చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: NIA, PFI

  ఉత్తమ కథలు