2 నెలల తర్వాత తొలిసారి.. స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు

గత రెండు నెలల్లో అంతర్జాతీయంగా 30శాతం వరకు పడిపోయిన చమురు ధరలు ఇప్పుడిప్పుడే స్థిరపడుతుండటంతో ధరలు పెట్రోల్ ధరలు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

news18-telugu
Updated: December 14, 2018, 8:26 AM IST
2 నెలల తర్వాత తొలిసారి.. స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: December 14, 2018, 8:26 AM IST
గత రెండు నెలలుగా వరుసగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.70.20 ఉండగా.. గురువారం రూ.70.29కి చేరింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ చెప్పిన వివరాల ప్రకారం.. దేశంలోని మెట్రో నగరాలైన ముంబై, చెన్నైలలో పెట్రోల్ ధర 11 పైసల నుంచి 13 పైసలు పెరిగింది.

గురువారం ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.75.80 నుంచి 75.91కి పెరిగింది. అలాగే చెన్నైలో లీటరు పెట్రోల్ దర రూ.72.82 నుంచి 72.94కి చేరింది. ఇక కోల్‌కతాలో మాత్రం గురువారం లీటరు పెట్రోల్‌పై రూ.90పైసలు, లీటరు డీజిల్‌పై 72.38పైసలు తగ్గడం విశేషం. దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు పెరిగినప్పటికీ డీజిల్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడం గమనార్హం.


గత రెండు నెలల్లో అంతర్జాతీయంగా 30శాతం వరకు పడిపోయిన చమురు ధరలు ఇప్పుడిప్పుడే స్థిరపడుతుండటంతో ధరలు పెట్రోల్ ధరలు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. గురువారం ఆసియా మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 60డాలర్లు పలికింది. అదే సమయంలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కూడా ఇండియాలో పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
First published: December 14, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...