ఎన్నికలు ముగిశాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి..

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు 8-10 పైసల మేర పెరగ్గా.. డీజిల్ ధరలు 15-16పైసల మేర పెరిగాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినందువల్లే దేశీ మార్కెట్‌లోనూ ఇంధన ధరలు పెరిగాయని చెబుతున్నారు.

news18-telugu
Updated: May 20, 2019, 12:15 PM IST
ఎన్నికలు ముగిశాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లోక్‌సభ ఎన్నికలు ముగిసిన మరుసటిరోజే పెట్రోల్, డీజిల్ ధరలు పైకి ఎగబాకాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు 8-10 పైసల మేర పెరగ్గా.. డీజిల్ ధరలు 15-16పైసల మేర పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డేటా ప్రకారం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.71.12,డీజిల్ ధర రూ.66.11గా ఉంది.అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినందువల్లే దేశీ మార్కెట్‌లోనూ ఇంధన ధరలు పెరిగాయని చెబుతున్నారు.

చమురు ఉత్పత్తి దేశాలు పరిమిత క్రూడ్ ఆయిల్ సరఫరాకి ఒప్పుకున్నట్టు సౌదీ మంత్రి ఖలీద్ అల్ ఫలీహ్ ప్రకటించిన అనంతరం ధరలు 1% మేర పెరిగాయి. ప్రస్తుతం ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.76.73, డీజిల్ ధర రూ.69.27గా ఉంది. కోల్‌కతా, చెన్నైలలో లీటరు పెట్రోల్ ధర రూ.73.19 నుంచి ధర రూ.73.82కి ఎగబాకింది. డీజిల్ ధర రూ.67.86 నుంచి రూ.69.88కి పెరిగింది.
First published: May 20, 2019, 12:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading