కొత్త సంవత్సరంలో మరికొంత తగ్గిన ఇంధన ధరలు

కొత్త సంవత్సరంలో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతుండమే.

news18-telugu
Updated: January 2, 2019, 1:54 AM IST
కొత్త సంవత్సరంలో మరికొంత తగ్గిన ఇంధన ధరలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొత్త సంవత్సరంలో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతుండమే. దీంతో గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతున్నాయి. అందులో భాగంగా ఈ ఏడాది తొలిరోజున కూడా ఇంధన ధరలు ఇంకాస్త తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 19 పైసలు తగ్గి రూ. 68.65గా ఉంది. లీటర్‌ డీజిల్‌ ధర కూడా 20 పైసలు తగ్గి 62.66గా ఉంది.

మిగితా ప్రధాన నగరాలో ఈ విధంగా వుంది.  ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 74.30, కోల్‌కతాలో రూ. 70.78, చెన్నైలో రూ. 71.23, హైదరాబాద్‌లో రూ. 72.82గా ఉంది. ఇక డీజిల్‌ ధర ముంబయిలో లీటర్‌కు రూ. 65.56, కోల్‌కతాలో రూ. 64.42, చెన్నైలో రూ. 66.15, హైదరాబాద్‌లో రూ. 68.11గా ఉంది.

First published: January 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...