పెట్రోల్‌పై ఈ ఏడాదికి ఇదే గుడ్ న్యూస్..

ఆదివారం లీటరు పెట్రోల్ ధర రూ.69.26 నుంచి 69.04కి తగ్గగా.. లీటరు డీజిల్ ధర రూ.63.32 నుంచి 63.09కి తగ్గింది.

news18-telugu
Updated: December 30, 2018, 3:28 PM IST
పెట్రోల్‌పై ఈ ఏడాదికి ఇదే గుడ్ న్యూస్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆదివారం లీటరు పెట్రోల్‌ ధర 22 పైసలు తగ్గింది. దీంతో ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.69.04గా ఉంది. ఈ ఏడాది మొత్తంలో ఇదే అత్యంత కనిష్ట ధర కావడం విశేషం. మరోవైపు లీటరు డీజిల్‌పై 23పైసలు తగ్గింది. తగ్గిన ధరతో ప్రస్తుతం ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.69.26గా ఉంది.లీటరు పెట్రోల్ ధర రూ.69.26 నుంచి 69.04కి తగ్గగా.. లీటరు డీజిల్ ధర రూ.63.32 నుంచి 63.09కి తగ్గింది.

అక్టోబర్ 18 నుంచి మధ్యలో ఒకరోజు తప్ప ప్రతీరోజూ పెట్రోల్ ధర స్వల్ప మేర తగ్గుతూ వస్తోంది. డీజిల్ ధరలు మార్చి నెలాఖరి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. మొత్తంగా అక్టోబర్ 18నుంచి ఇప్పటివరకు లీటరు పెట్రోల్ ధర రూ.13.79 మేర తగ్గింది. గడిచిన రెండున్నర నెలల్లోనే లీటరు డీజిల్ ధర రూ.12.6 మేర తగ్గింది.


అంతకుముందు అగస్టు 16నుంచి వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు అక్టోబర్ 4న గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆరోజు ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.91.34కి చేరగా.. లీటరు డీజిల్ ధర రూ.80.10కి చేరుకుంది. అగస్టు 16 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు పెట్రోల్ ధర మొత్తం రూ.6.86 పెరగ్గా.. డీజిల్ ధర రూ.6.73 పెరిగింది. అయితే అక్టోబర్ 18వ తేదీన పెట్రోల్, డీజిల్‌లపై కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించడంతో అప్పటినుంచి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

First published: December 30, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...